YSRCP Leader To Janasena : జనసేనలో చేరనున్న వైసీపీ ఉత్తరాంధ్ర నేత ఎవరు.?

YSRCP Leader To Janasena : వైసీపీ లోంచి జనసేన పార్టీకి వలసలు జోరందుకోబోతున్నాయి.? వినడానికి హాస్యాస్పదంగానే వున్నా, ఇది నిజమేనట. రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పుడెలాగైనా మారొచ్చు.
2024 ఎన్నికల్లో జనసేన పార్టీ ఎంత గట్టిగా నిలబడుతుంది.? అన్నది వేరే చర్చ. కానీ, వైసీపీలో కొందరు నేతలు ఇమడలేకపోతున్నారు. అలాగని, వాళ్ళలో చాలామంది పార్టీ మారలేకపోతున్నారు.
మారేందుకు అవకాశం వున్న కొందరు నేతలు అయితే బీజేపీలోకి, లేదంటే జనసేనలోకి వెళ్ళేందుకు సమాయత్తమవుతున్నారట.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఉత్తరాంధ్రకు చెందిన ఓ వైసీపీ నేత, జనసేన పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారట.
ఈ విషయం వైసీపీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్ళిందని అంటున్నారు. ఆ కారణంగానే ఆయనకు కీలకమైన పదవి దక్కాల్సి వున్నా, వైఎస్ జగన్ ఆయన్ని వ్యూహాత్మకంగా దూరం పెట్టారని తెలుస్తోంది.
ఈ ప్రచారంలో నిజమెంత.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. జనసేన పార్టీ మైండ్ గేమ్ స్టార్ట్ చేసిందనీ, అంతే తప్ప.. వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్ళేవారెవరూ లేరనీ వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మరోపక్క, వైసీపీ నుంచి మంత్రులుగా పనిచేసినవారు కూడా జనసేనలోకి రాబోతున్నారని జనసేన కాన్ఫిడెంటుగా చెబుతోంది.
ఉభయ గోదావరి జిల్లాల్లో ‘కాపు’ సామాజిక వర్గానికి చెందిన ఓ ముఖ్య నేత కూడా వైసీపీ నుంచి జనసేనలోకి దూకెయ్యబోతున్నారట. ఓ మాజీ మంత్రి వైసీపీని వీడి జనసేనలోకి వచ్చేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారని అంటున్నారు.
అయినా, ప్రతిపక్షం టీడీపీలోకి కాకుండా జనసేనలోకి సదరు నేతలు ఎందుకు దూకాలని చూస్తున్నట్టు.?