చాలామంది రాజకీయ నాయకులు అధికారంలోకి రావడం కోసం తమ నోటికి ఏది వస్తే అదే చెబుతుంటారు. నెరవేర్చలేని హామీలను కూడా ఇస్తుంటారు. ఇదంతా ఎన్నికల్లో గెలవడం కోసం చేసే స్టంట్. చాలా పార్టీల మేనిఫెస్టోను చూస్తే అలాగే ఉంటుంది. నెరవేర్చలేని ఎన్నో హామీలు. వాటిని చూసి జనాలు ఓటు వేస్తారని వాళ్ల ఆశ.
కానీ.. సీఎం జగన్ మాత్రం తన మేనిఫెస్టోలో ఉన్న హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు. అధికారంలోకి వచ్చిన రెండో సంవత్సరం నుంచి వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభిస్తామని ఎన్నికల ముందు వైఎస్ జగన్ హామీ ఇఛ్చారు. ఇఫ్పుడు అమలు చేస్తున్నారు.
శుక్రవారం నుంచి వైఎస్సార్ ఆసరా పథకాన్ని సీఎం జగన్ అట్టహాసంగా ప్రారంభించబోతున్నారు. ఈ పథకం వల్ల సుమారు 87 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది.
2019 ఏప్రిల్ 11 వరకు అంటే అసెంబ్లీ ఎన్నికల రోజు వరకు పొదుపు సంఘాల పేరుతో బ్యాంకుల్లో ఉండే అప్పు మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించడం కోసం తీసుకొచ్చిందే వైఎస్సార్ ఆసరా పథకం.
ఈ అప్పు మొత్తాన్ని ప్రభుత్వమే నాలుగు విడుతల్లో చెల్లిస్తుంది. ఏపీలో మొత్తం సుమారు 8 లక్షలా 71 వేల పొదుపు సంఘాలు ఉండగా… అందులో 87 లక్షల 74 వేల మంది మహిళల పేరుతో బ్యాంకులలో ఉన్న అప్పు 27,168 కోట్లు. ఈ డబ్బును ప్రభుత్వం నాలుగు విడుతల్లో డైరెక్టుగా సంఘాల పొదుపు ఖాతాల్లో జమ చేస్తుంది.
ఇక.. మొదటి విడుతలో భాగంగా 6792 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఇవాళ జమచేస్తుంది. ఇక.. ఈ పథకాన్ని సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు.
పథకం ప్రారంభం అయిన తర్వాత ఈరోజు నుంచి ఏడు రోజుల పాటు వైఎస్సార్ ఆసరా వారోత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది.