సీఎం జగన్ జాతకం అలా ఉందా.. ఆ నెల నుంచి జగన్ కు తిరుగులేదట!

2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలామంది భావించినా 151 అసెంబ్లీ స్థానాలలో వైసీపీ విజయం సాధిస్తుందని ఎవరూ భావించలేదు. టీడీపీ, జనసేన నేతలు విమర్శలు చేస్తున్నా జగన్ ను అభిమానించే అభిమానుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదనే సంగతి తెలిసిందే. పేద ప్రజల్లో ఎక్కువమందిలో సీఎం జగన్ పై పాజిటివ్ ఒపీనియన్ ఉండటం గమనార్హం.

అయితే తాజాగా ఒక జ్యోతిష్కుడు జగన్ జాతకం గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బుధ మహాదశ నడుస్తోందని ఆయన చెప్పారు. సెప్టెంబర్ నెల 22వ తేదీ నుంచి బుధ మహాదశలో శుక్ర అంతర్దశ ప్రారంభం అవుతుందని ఆయన చెప్పుకొచ్చారు. 2025 సంవత్సరం జులై 27వ తేదీ వరకు శుక్ర అంతర్దశ ఉంటుందని ఆయన కామెంట్లు చేశారు.

అప్పటివరకు జగన్ కు అనుకూల పరిస్థితులు ఉంటాయని జ్యోతిష్కుడు వెల్లడించారు. సీఎం జగన్ కు అడ్డంకులు ఎదురుకావడం వెనుక గల కారణాలను సైతం జ్యోతిష్కుడు వెల్లడించారు. జగన్ ప్రమాణ స్వీకారం చేసిన సమయం మంచిది కాదని అందువల్లే ఆయనకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని జ్యోతిష్కుడు చెప్పుకొచ్చారు. రవి బలంగా లేని సమయంలో జగన్ ప్రమాణ స్వీకారం చేశారని అందుకే ఇబ్బందులు వచ్చాయని జ్యోతిష్కుడు పేర్కొన్నారు.

జగన్ విజయస్థానం పవన్ సాధన స్థానం ఒకటేనని జ్యోతిష్కుడు చెప్పుకొచ్చారు. పవన్ సహకారం లేకపోతే జగన్ కు ఇబ్బందులు అని 2014లో వైసీపీకి అనుకూలంగా ఫలితాలు రాకపోవడానికి 2019 ఎన్నికల్లో జగన్ కు అనుకూలంగా ఫలితాలు రావడానికి ఇదే కారణమని ఆయన తెలిపారు. 2024 ఎన్నికల్లో ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు వస్తాయేమో చూడాల్సి ఉంది.