ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేయడానికి రంగం సిద్దం చేస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మార్చికల్లా 26 జిల్లాలు ఏర్పాటు చేయాలని సంకల్పించి కమిటీ వేసి ప్రక్రియ మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ప్రముఖల పేర్లను, స్వాత్రంత్య్ర్య సమర యోధుల పేర్లను పెట్టబోతున్నారు. అలాగే ఓ జిల్లాకు స్వర్గీయ నందమూరి తారకరామారావు పేరు పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ధిక సంస్కర్త, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు కూడా ఓ జిల్లాకు పెట్టాలన్న అంశం తెరమీదకు వచ్చింది. పీవీ పేరుతో ఓ జిల్లాను ఏర్పాటు చేయాలని ఇండో అమెరికన్ బ్రాహ్మణ సమాఖ్య వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
ఆ సంఘం చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ సీఎం జగన్ కు ఓ లేఖ కూడా రాసారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు కూడా పీవీ పేరు పెట్టాలని ఆ సంఘానికి మద్దుతుగా నిలిచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ డిమాండ్ ని జగన్ కాదనలేరని తెలుస్తోంది. తొలి తెలుగు ప్రధాని.. తెలుగు వారి కీర్తిని నలుదిశలా వ్యాపించారు. దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టి ప్రధాని. ఇలా పీవీ గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఆసక్తికర విషయాలే ఉన్నాయి. ఇప్పటికే పీవీకి భారతరత్న అందించాలని తెలంగాణ రాష్ర్టముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మానించారు. నక్లెస్ రోడ్డుకి పీవీ పేరు పెట్టడం జరిగింది. ఓ జాతీయ రహదారికి పీవీ గా నామకరణం చేసారు.
ఇంకా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. తెలుగు వారు ప్రతీ ఏటా పీవీ ఉత్సవాల్సి ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. కాబట్టి ఏపీలో ఒక జిల్లాకు పీవీ పేరు తప్పని సరి అని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కూడా కాదనే అవకాశం లేదు. ఇప్పటికే ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పేర్లు పెట్టబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అమరావతికి సమీపంలో ఉన్న జిల్లాల్లో ఒక దానికి ఎన్టీఆర్ పేరు..విశాఖ సమీపంలో ఏర్పడే జిల్లాకు అల్లూరి పేరుగా నామకరణం చేయనున్నారు.