2019 ఎన్నికల్లో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని, ఎన్నో సమీకరణాలు చేసి, ఎందరో నాయకులను ఒప్పించి, ఎన్నో హామీలు ఇచ్చి జగన్ మోహన్ రెడ్డి ఏపీ రాష్ట్రానికి సీఎంగా ఎన్నికయ్యారు. అయితే ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయానికి ఎదో ఒక అడ్డంకి వచ్చి ప్రభుత్వం కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది. ఇప్పటికే రంగుల విషయంలో డాక్టర్ సుధాకర్ విషయంలో, ఈసీ విషయంలో కేసుల వైసీపీ ప్రభుత్వానికి ఎదురు తగిలిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు జగన్ అనుకున్న మరో రెండు ప్రాముఖ్యమైన పథకాలను కూడా టీడీపీ నేతలు సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారు. అయితే ఈ నిర్ణయాలను సమర్ధంతంగా అమలు చేయకపోతే తమ పార్టీకి రానున్న రోజుల్లో చిక్కులు రానున్నాయని వైసీపీ నేతలు కూడా చెప్తున్నారు.
ఈ రెండు నిర్ణయాల్లో ఒకటి ఇళ్ల పట్టాల పంపిణీ. ఈ కార్యక్రమం ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఒకసారి కరోనా వల్ల, మరోసారి కేసుల వల్ల ఈ పథకం వాయిదా పడింది. ఇక ఈ పథకం ఎప్పటికి అమలు అవుతుందో ఎవరికి తెలియదు. ఈ పథకం ద్వారా మూడేళ్ళలో పక్కా ఇళ్లను నిర్మించడానికి ప్రయత్నించింది. అలాగే జగన్ తీసుకున్న మరో ప్రధానమైన నిర్ణయం మూడు రాజధానుల అంశం. ఈ ప్రయత్నం మొదటి నుండి కూడా విపహాలమవుతూనే ఉంది. ఈ నిర్ణయాన్ని టీడీపీ నాయకులు అడుగడున అడ్డుకుంటున్నారు. గవర్నర్ ముద్ర వేయించుకున్న తరువాత ఈ నిర్ణయానికి అమరావతి రైతులు అడ్డుగా నిలిచారు. ఇప్పుడు ఈ మూడు రాజధానుల అంశంపై హై కోర్టు ఈనెల 27 వరకు స్టేటస్ కో విధించింది. ఈ నిర్ణయం కూడా ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందో తెలియడం లేదని వైసీపీ నేతలే చర్చించుకుంటున్నారు. ఈ రెండు ప్రముఖ్యమైన నిర్ణయాలు అమలు కాకపోతే రానున్న రోజుల్లో వైసీపీ పార్టీ ప్రమాదంలో పడనుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.