జగన్ విషయం లో మోడీ చారిత్రాత్మిక నిర్ణయం .. ఏపీ తలరాత మారనుందా ?

Ys jagan - Modi

రాజకీయాలు అంటేనే ఒక పద్మవ్యూహం.. అందుకే రాజ‌కీయాల్లో లౌక్యం తెలిసి ఉండాల‌ని అంటారు పెద్ద‌లు.. ఈ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.. అందుకే ఇక్కడ అవసరాన్ని బట్టి అవకాశాలు, అవకాశ వాదులు పుట్టుకొస్తు ఉంటారు.. ఇక రాజకీయ స్నేహం కోసం ఆలోచిస్తే ముఖ్యంగా ఇక్కడ స్నేహ ప్రాధాన్యతలు, పొత్తులు ఇలా ఏదైనా అవసరాల మేరకే ఉంటాయి. ఒకరికి ఒకరు అవసరం ఉన్నంత వరకు మాత్రమే ఇందులో మిత్రులుగా కొనసాగుతారు.. కాబట్టి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది ప్రచారంలో ఉంది..

ఇకపోతే ఏపీలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక, కేంద్రంతో మంచి సంబంధాలనే కొనసాగించారు, ఇప్పటికి కూడా కొనసాగిస్తున్నారు కూడా.. కానీ రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయాక కేంద్రం నుండి ఏపీకీ రావలసిన నిధులు ఇప్పటికి ఆలస్యం అవుతూ వస్తున్నాయి.. ఈ విషయంలో సీయం జగన్ ఎన్నో సార్లు కేంద్ర పెద్దలను కలసి వివరించారు కూడా.. అయినా గానీ ఏపీకి అందవలసిన సౌకర్యాలు, నిధులు ఇప్పటికి ఆలస్యం అవుతూ వస్తూనే ఉన్నాయి.. కానీ ఏపీ బీజేపీ నాయకులు మాత్రం వైసీపీని రాజకీయ శత్రువుగా చూస్తున్నారు. కేంద్రంలో జగన్ సఖ్యతతో మెలుగుతూ వస్తున్నా, ఏపీ బీజేపీ నాయకులు మాత్రం జగన్‌ను దూరదూరం పెడుతున్నారు.. అదీగాక గత కొద్ది రోజులుగా అంతర్వేది వ్యవహారం రాజుకోవడంతో ఏపీ బీజేపీ దృష్టిలో వైసీపీ బద్ద శత్రువుగా మారింది.. అయినా గానీ వైఎస్ జగన్ మాత్రం కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తూ వస్తున్నారు.

ఇలా ఏ విషయంలోనూ జగన్ మాట నెగ్గకుండా కేంద్రం వ్యవహరిస్తున్న తీరుతో వైసీపీ శ్రేణులు విసిగిపోతూ, బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ఏ మాత్రం ఇష్టపడటం లేదన్నది ప్రచారం జరుగుతుంది.. అయితే ఇప్పటి పరిస్దితులు ఎలా ఉన్నా రానున్న రోజుల్లో బీజేపీకి, వైసీపీ మద్దతు చాలా అవసరం. ఆ పార్టీ రాజ్యసభ స్థానాలు ఎక్కువగా ఉండడంతో, కీలక బిల్లులను ఆమోదించుకోవాలన్నా, వైఎస్ జగన్ మద్దతు తప్పనిసరి. అంతే కాకుండా ప్రజాకర్షణ ఉండి, అన్ని విషయాల్లోనూ తెగువ చూపించే జగన్ వంటి వ్యక్తులను దూరం చేసుకునే కంటే, సఖ్యతగా ఉంటేనే బీజేపీకి భవిష్యత్తులోనూ మేలు జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారట.. మరి ఇలాంటి సమయంలో మోడీ వైఎస్ జగన్ విషయంలో, ఏపీ విషయంలో ఆచితూచి వ్యహరించవలసిన అవసరం ఉంది.. ఇదే గనుక జరిగితే ఏపీ తలరాత మారే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం అవుతుంది..