బాబోయ్ వైఎస్ జగన్‌లా నిర్ణయాలు తీసుకోవడం అసాధ్యమట.. మోడీ మాటనే మడతెట్టాడుగా.. !

Ys jagan - Modi

ఏపీ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తేనెతుట్టలా ఊరిస్తున్న అంశం ఎన్డీఏలో వైసీపీ చేరనుందా లేదా.. ఈ విషయం అటు వైసీపీలోను, ప్రతిపక్షం అయినా టీడీపీలోను ఒకటే ఆసక్తిని కలిగించింది.. వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్ళిన ప్రతి సారి అయితే చంద్రబాబు తెగ ఇదైపోవడం, ఏదో జరుగుతుందనే ఆందోళన చెందడం తెలిసిందే.. ఇలా ఎందుకంటే ఎక్కడ వైఎస్ జగన్, కేంద్రంలోని పెద్దలకు దగ్గరైపోయి తన ఆశల మీద నీళ్లు కుమ్మరిస్తాడో అని బయటకు కనబడకున్న లోలోపల ఉడికిపోతున్నాడట బాబు గారు. కానీ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా రాష్ట్ర అభివృద్ధినే ముఖ్యమైన అంశంగా తీసుకున్న ఏపీ సీయం వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన అన్ని ఆఫర్లను తిరస్కరించారని తెలుస్తుంది..

ఇక గత కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు జరగబోతున్నాయనే ప్రచారానికి పులిస్టాప్ పడేలా వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని పరిశీలిస్తే.. ఎన్డీఏలో వైసీపీ చేరితే లాభాల మాట అటుంచి నష్టాలే ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని వైసీపీ అంతర్గత చర్చలో గుర్తించిందట.. అందువల్ల వైసీపీ ఇప్పట్లో ఎన్డీఏలో చేరేది లేదని, లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి కూడా స్వీకరించదని, కాకపోతే కేంద్రం తీసుకునే నిర్ణయాల విషయంలో అంశాల వారీగా బయట నుంచి మద్దతు ఇస్తామని, మోడీకి, వైఎస్ జగన్ స్వయంగా చెప్పినట్టు ప్రచారం అవుతుంది.. ఇకపోతే అధికార పార్టీ వైసీపీ కేంద్ర మంత్రి పదవులు, డిప్యూటీ స్పీకర్ లాంటి పదవుల్ని సైతం వదులు కోవడానికి కారణం ప్రత్యేక హోదా అనే అంశం..

అవును టీడీపీ ఆశపెట్టి వదిలేసిన ఈ అంశాన్ని ఎట్టిపరిస్దితుల్లో వదులుకో కూడదని భావించిన వైఎస్ జగన్ ఇలాంటి టైమ్ లో ఎన్డీఏలో చేరితే.. ప్రత్యేక హోదా రాదేమో అనే అనుమానం ప్రజల్లో బలపడటమే కాదు పార్టీకి కూడా డ్యామేజ్ కలిగే అవకాశం ఉందని, ఇదే టైంలో టీడీపీ లేనిపోని రాద్దాంతం చేసే అవకాశాన్ని ఇచ్చినట్లుగా అవుతుందని భావించిన వైఎస్ జగన్, పదవుల కంటే ప్రత్యేక హోదా ముఖ్యమని ముందుకు వెళ్లుతున్నట్లు తెలుస్తుంది.. కాగా ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి జరిగే ఉపయోగాలేంటో వైఎస్ జగన్ కు బాగా తెలుసు. అందుకే బీజేపీ ఎన్ని ప్రలోభాలకు లోను చేస్తున్నప్పటికీ ఏపీ సీయం తన ఎజెండా నుంచి తప్పుకోలేదు. అందుకే ఏపీ విషయంలో వైఎస్ జగన్ తీసుకునే నిర్ణయాలు ఆశపరులకు చెమటలు పట్టిస్తున్నాయట.. ఇక మోడీ ఇచ్చిన ఆఫర్‌ను మడతెట్టేసి తీసుకున్న నిర్ణయానికి ఫిదా అవుతున్న ప్రజలు మా జగనన్న లాగా ఎవరు సాహసం చేయరని అనుకుంటున్నారట..