ఏపీ సీయం వైఎస్ జగన్ ఇప్పటి వరకు పేద ప్రజల అభివృద్ధికై ఎన్నో సంక్షేమ పధకాలను అమలు చేశారన్న విషయం తెలిసిందే.. ఇక తాజాగా రైతులు ఎక్కువగా ఎదుర్కొంటున్న బోరు బావుల సమస్యకై కూడా పరిష్కారాన్ని చూపించారు.. అదీగాక రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా భారీగా బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం వీటికి చైర్మన్లు, డైరెక్టర్ల పదవులను కూడా ప్రకటించనుంది. ఇలా అందరిని తన వారిగా ఆదరిస్తున్న వైసీపీ ప్రభుత్వ అధినేత వైఎస్ జగన్ విజయవాడ అభివృద్ధిలో భాగంగా, బాపు మ్యూజియాన్ని అక్టోబర్ ఒకటో తేదీన లాంఛనంగా పున: ప్రారంభించనున్నారట..
ఇకపోతే హైదరాబాద్ సాలర్జంగ్ మ్యూజియం కు ఉన్న ప్రాముఖ్యత విజయవాడ బాపు మ్యూజియంకు కూడా వచ్చే విధంగా దీన్ని తీర్చిదిద్దారట.. కాగా లక్ష ఏళ్ల క్రితం ఆదిమానవులు వినియోగించిన వస్తువులు మ్యూజియం లో పొందుపరిచారట. ఇక విజయవాడ బందరు రోడ్డులో ఉన్న ఈ మ్యూజియాన్ని ఎనిమిది కోట్ల రూపాయలతో ఆధునికీకరించడమే కాకుండా అత్యాధునిక సాంకేతికతతో ఈ మ్యూజియాన్ని అభివృద్ధి చేశామని, కొత్తగా నిర్మించిన భవనంలో ఆదిమ యుగం నుంచి ఆధునిక యుగం వరకు 1500 వస్తువులను ప్రదర్శనలో ఉంచినట్లు, ఈ బాపు మ్యూజియం విజయవాడ కి తలమానికం అవుతుందని పురావస్తుశాఖ కమిషనర్ జి.వాణిమోహన్ తెలిపారు..
అంతే కాకుండా దేశంలోని ఏ మ్యూజియంలో లేని విధంగా స్మార్ట్ఫోన్లోని యాప్ ద్వారా ఇక్కడి ప్రదర్శిత వస్తువుల చరిత్ర తెలుసుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఇక ఎప్పటి నుంచో అభివృద్ధికి నోచుకోకుండా.. మూతపడి ఉన్న బాపు మ్యూజియాన్ని ఏపీ సీయం వైఎస్ జగన్ తన హయామంలో పున:ప్రారంభం చేయడం ఎప్పటికి మరచిపోని విధంగా ఉంటుందని ఆ పార్టీ నాయకులు అంటున్నారట.. కాగా ఇదే తరహాలో కొండపల్లి కోటను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు..