3 రాజధానుల వివాదంలో – జగన్ కి సపోర్ట్ గా సెన్సేషనల్ పాయింట్ దొరికింది!

రాజధాని తరలింపుపై సీఎం జగన్ మోహన్ రెడ్డికి చాలామంది వ్యతిరేకంగా ఉన్నారు. టీడీపీ నేతలు, అమరావతి రైతులు ఈ నిర్ణయాన్ని అడ్డుకుంటున్న వారిలో ప్రథములు. రాష్ట్రంలో ఉన్న దాదాపు అన్ని పార్టీలు వైసీపీ నాయకులు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.

అయితే ఇప్పుడు కొంతమంది రాజకీయ నిపుణులు, వ్యాపార నిపుణులు జగన్ నిర్ణయాన్ని సమర్దిస్తున్నారు. విశాఖకు ఉన్న పొటెన్షియాలిటీ ఇపుడున్న పరిస్థితుల్లో ఏపీ వాడుకోవడానికి పూర్తిగా ఉపయోగపడుతుందని వివిధ రంగాల నిపుణులూ అంటున్నారు. విశాఖ వంటి గ్రోత్ ఇంజన్ సిటీని ఉంచుకుని కొత్త ప్రయోగాలు చేయడం కూడా సమంజసం చేయడమే తప్పు అన్న వాదన కూడా ఉంది. రాజధానిగా విశాఖను నాడే చేసి ఉంటే ఇప్పటికే మిగిలిన సౌతిండియా సిటీలతో పోటీ పడేదని కూడా అంటున్నారు. జగన్ లేట్ గా అయినా మంచి ఆలోచనే చేశారని కూడా అంటున్నారు.

ఈ నేపధ్యంలో జగన్ విశాఖకు కనుక షిఫ్ట్ అయితే చాలా తొందరలోనే ప్రగతి ఫలాలు కనిపిస్తాయని టీడీపీ అంచనా వేస్తోంది. విశాఖను చూసి పెట్టుబడులు పెడతామని చంద్రబాబు హయాంలో కూడా ఇన్వెస్టర్లు వచ్చారట. అయితే ఆయన అమరావతిలో పెట్టుబడులు పెట్టమని చెప్పడంతో అవన్నీ వెనక్కిపోయాయి. ప్రతీ ఏటా ఇన్వెస్టెర్ల సెమినార్ల ద్వారా బాబు విశాఖను చూపించే పెట్టుబడుల దారులను రప్పించిన సంగతి తెలిసిందే. వారే ఇపుడు జగన్ వెనకాలా గట్టిగా నిలబడతామని అంటున్నారు. ఇప్పుడు ఇదే పాయింట్ వైసీపీ నేతలకు మరింత ధైర్యం వచ్చింది. అప్పుడే వచ్చినా ఇన్వెస్టర్లు , ఇప్పుడు రాజధాని అయిన తరువాత ఎందుకు రారని వైసీపీ నేతలు ఆలోచిస్తున్నారు. విశాఖలో ఉన్న వనరులను వాడుకుంటే రానున్న రోజుల్లో అన్ని రాజధానులు పోటీ ఇవ్వవచ్చని రాజకీయ నిపుణులు చెప్తున్నారు.