విశాఖలోని వైసీపీ రాజకీయలన్ని గంటా శ్రీనివాసరావు చుట్టూ తిరుగుతున్నాయి. టీడీపీ పార్టీని వదిలి వైసీపీ వెళ్ళడానికి గంటా శ్రీనివాస రావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు కానీ విశాఖలో ఉన్న వైసీపీ దీన్ని అడ్డుకుంటున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్న వైసీపీ నాయకులు గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి రాకూడదని ధర్నాలు కూడా చేస్తున్నారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం గంటాను పార్టీలోకి తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు.
అయితే ఈ నిర్ణయంపై ఆగ్రహంతో ఉన్న వైసీపీ నాయకులు 2018 అక్టోబర్ లో విశాఖలోని తిమ్మాపురం జంక్షన్ దగ్గర దివంగత వైఎస్ఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు కూడా గంటా అడ్డుపడ్డారని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అరెస్టుచేయించాడని,అలాంటి నేతను ఇప్పుడు పార్టీలోకి తీసుకోవలసిన అవసరం ఏమి ఉందని ప్రశ్నిస్తున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం గంటా శ్రీనివాసరావును పార్టీలోకి ఆహ్వానించానికి సిద్ధమయ్యారు కానీ గంటా శ్రీనివాసరావు ను ఒక పని అప్పగించారని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
ఆపని ఏంటంటే ఇప్పుడు విశాఖలో బలంగా ఉన్న టీడీపీ నేతలను కూడా వైసీపీలోకి తీసుకురావాలనే ఒక కండిషన్ పెట్టినట్టు సమాచారం. ఎందుకంటే విశాఖను పరిపాలనా రాజధానిగా మార్చడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఒకవేళ భవిష్యత్ లో విశాఖ పరిపాలనా రాజధాని అయితే అక్కడ టీడీపీకి బలమైన నాయకులు ఉంటే తాను తీసుకునే నిర్ణయాలకు అడ్డు తగిలే అవకాశం ఉందని భావిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందే వాళ్ళను కూడా తనఅధీనంలోనే ఉంచుకోవాలని చూస్తున్నారు. అందుకే ఇప్పుడు అక్కడ బలంగా ఉన్న టీడీపీ నాయకులను సైతం వైసీపీలో చేర్చే పనిని గంటా శ్రీనివాసరావు కు అప్పగించి రెండు నెలల సమయం కూడా ఇచ్చాడని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పనిని గంటా శ్రీనివాసరావు ఎంతవరకు నెరవేర్చుతాడో వేచి చూడాలి.