చంద్రబాబు హ్యాండిల్ చేసినట్టు కేసిఆర్ ని హ్యాండిల్ చేయడం జగన్ కి చేత కావట్లేదు..?

రాజకీయాల్లో శాశ్వత స్నేహితులు ఉండరు, అలాగే శాశ్వత శత్రువులు కూడా ఉండరు. ఒకవేళ ఉన్నా కూడా మరో నేతనో, పార్టీనో వాళ్ళను విడగొట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రస్తుత పోరు చూస్తుంటే ఈ విషయం నిజమనిపిస్తుంది. 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి పూర్తి మద్దతు ప్రకటించారు. ఎన్నికల్లో ప్రచారం చేయలేదు కానీ వైసీపీ వ్యూహారచణలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హస్తముందని అప్పట్లో మీడియాలో కథనాలు కూడా వచ్చాయి.
KCR-Jagan
బహిరంగంగా కేసీఆర్ చంద్రబాబు నాయుడుపై చేసిన విమర్శలు ఆ కథనాలకు ఆజ్యం పోసింది. 2019 ఎన్నికల్లో గెలిచిన తరువాత కేసీఆర్ ను జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకంగా వెళ్లి కలిశారు. ఇంత స్నేహపూర్వకంగా ఉన్నా నేతలపై ఈసారి బీజేపీ కన్ను పడింది. వాళ్ళను విడగొట్టడానికి విశ్వప్రయత్నాలు చేస్తుంది.

ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం మొదలైంది. ఈ వివాదాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఇద్దరు నేతల మధ్య గొడవలు పెట్టడానికి కూడా బీజేపీ నేతలు వెనుకాడటం లేదు. జల వివాదంలో ఏపీకి అనుకూలంగా కేంద్రం వ్యవహరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలంగాణలో జరుగుతున్న సాగునీటి ప్రాజెక్ట్ నిర్మాణాలను ఆపివేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అలాగే కరోనా విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం తిడుతూ…పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ను చూసి నేర్చుకోవాలని కూడా సూచించింది. దీంతో ఇద్దరు నేతల మధ్య గొడవలు పెట్టి, ఆ గొడవలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది.

అయితే ఈ మైండ్ గేమ్స్ ను ఏ ఎదుర్కోవడంలో చంద్రబాబు నాయుడిలా జగన్ మోహన్ రెడ్డి వ్యవహరించడం లేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అలాగే బీజేపీ వేస్తున్న పన్నాగాలకు వైసీపీ నేతలు చిక్కుతున్నారని, అందుకే తనకు మిత్రుడైన కేసీఆర్ ను జగన్ మోహన్ రెడ్డిని దూరం చేసుకున్నాడని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. మాటలతో సాల్వ్ చేసుకునే జల సమస్యలను కేంద్రం దాకా తీసుకెళ్లిందని, ఇప్పుడు బీజేపీ పన్నిన వలలో జగన్ చిక్కుకొని కేసీఆర్ ను దూరం చేసుకున్నాడు. అలాగే కేసీఆర్ ను కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి బాబులా డీల్ చేయడం లేదని, అందుకే సోదరులుగా ఉండాల్సిన కేసీఆర్ తో గొడవలు పెట్టుకున్నాడని రాజకీయ పండితులు చెప్తున్నారు.