Blood Sugar: వేసవిలో షుగర్ వ్యాధి కంట్రోల్ లో ఉండాలంటే ఈ పండ్లు తినాల్సిందే!

Blood Sugar: వేసవి కాలం వస్తోందంటే ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.ముఖ్యంగా బిపి షుగర్ వంటి వ్యాధులతో బాధపడే వారు ఆరోగ్య విషయంలోనూ వారి ఆహార పదార్థాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.షుగర్ వ్యాధితో బాధపడే వారు వారి ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు తప్పనిసరి వారు తీసుకునే ఆహార పదార్థాలు శరీరంలో షుగర్ స్థాయిలను నిలకడగా ఉంచేలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక వేసవి కాలంలో షుగర్ వ్యాధితో బాధ పడేవారు షుగర్ కంట్రోల్ లో ఉండాలంటే కొన్ని రకాల పండ్లను తీసుకోవడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ పండ్లు ఏమిటి అనే విషయానికి వస్తే….

బ్లూ బెర్రీ: షుగర్ వ్యాధితో బాధ పడేవారు వేసవికాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన వాటిలో బ్లూబెర్రీ ఒకటి.ఈ పండును తరచూ తీసుకోవడం వల్ల చక్కెర వ్యాధిని నియంత్రణలో ఉంచడం కాకుండా ఊబకాయం రాకుండా కాపాడుతుంది.

నేరేడు పండు: నేరేడు పండ్లు ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయి ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు నేరేడుపండు ఒక దివ్యౌషధమని చెప్పవచ్చు. మధుమేహంతో బాధపడే వారు నేరేడు పండుతో పాటు వాటి విత్తనాలను కూడా తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.

జామ పండు: షుగర్ వ్యాధితో బాధపడే వారికి జామపండు ఎంతో మంచిది. జామ పండులో ఎక్కువగా ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగు పరచడానికి దోహదపడుతుంది. మనం తీసుకునే ఆహార పదార్థాలు పూర్తిగా జీర్ణం అయినప్పుడు మన శరీరంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.వీటితో పాటు బొప్పాయి యాపిల్ వంటి పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల తీసుకున్న ఆహార పదార్థాలు పూర్తిగా జీర్ణం అయ్యి శరీరంలో చక్కెర స్థాయిలను నిలకడగా ఉంచడానికి దోహదపడతాయి కనుక షుగర్ తో బాధపడేవారు ఈ పండ్లను తీసుకోవడం ఎంతో మంచిది.