Health Tips: మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా ఈ మధ్యకాలంలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.కొంతమందికి ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగి ఆరోగ్యానికి అవసరమైన పౌష్టికాహారం తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. మనం ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండాలంటే అత్యంత పోషక విలువలు కలిగిన ఓట్స్ తీసుకోవటం చాలా అవసరమని అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజు ఓట్స్ తినడం వల్ల శరీర ఆరోగ్యానికి అవసరమైన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ఓట్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఓట్స్ అనేక రకాల చిరుధాన్యాల మిశ్రమం. ప్రతిరోజు ఉదయం అల్పాహారంగా ఓట్స్ తినడం వల్ల అనేక రకాల పోషకాలు శరీరానికి అందుతాయి. ఓట్స్‌లో ఐరన్, కాల్షియం, ఫైబర్, మెగ్నిషియం వంటి మినరల్స్ అధికంగా ఉంటాయి. ప్రతిరోజు ఉదయం అల్పాహారంగా తీసుకోవడం వల్ల అందులో ఉండే ఫైబర్ ఆకలిని నియంత్రించి శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తుంది. వీటిని తినటం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరిగించి సంబంధిత వ్యాధులు తలెత్తకుండా కాపాడుతాయి.
ఓట్లలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపరచి మలబద్ధకం, అజీర్తి, గ్యాస్ట్రిక్ వంటి సంబంధిత సమస్యలు తలెత్తకుండా కాపాడుతుంది. ఓట్స్ లోఐరన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో రక్తహీనత సమస్య కూడా నియంత్రిస్తుంది. ఓట్స్ లో ఉండే క్యాల్షియం శరీరంలోని ఎముకలు దంతాలు దృఢంగా ఉండేలా చేస్తుంది.
ప్రతిరోజు ఉదయం ఒక కప్పు ఓట్స్ లో గోరువెచ్చని పాలు, పండ్ల మొక్కలు, తేనె కలిపి తినడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి లభించి ఈ రోజంతా ఆక్టివ్ గా ఉండేలా చేస్తాయి.