YCP Leader : బాలకృష్ణకి అలా బుద్ధి చెప్పాలంటున్న వైసీపీ ఎమ్మెల్యే.. కారణమిదే.!

YCP Leader : సినిమా వ్యవహారాలు తప్ప, నందమూరి బాలకృష్ణకు తన సొంత నియోజకవర్గం హిందూపురం ప్రజల గురించిన ధ్యాస వుండదా.? అంటూ వైసీపీ నేత, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ సంచలన రీతిలో ప్రశ్నాస్త్రం సంధించారు. నియోజకవర్గ ప్రజల గోడు వినిపించుకునేలా ఎమ్మెల్యే బాలకృష్ణకు బుద్ధి ప్రసాదించాలని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ని కోరాలని టీడీపీ నేతలకు ఎమ్మెల్సీ ఇక్బాల్ ఉచిత సలహా ఇచ్చారు.

2019 ఎన్నికల్లో బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుంచి ఓడిపోతారని అంతా భావించారు. అయితే, ఇక్బాల్‌పై నందమూరి బాలకృష్ణ అనూహ్యమైన విజయాన్ని అందుకున్నారు హిందూపురం నియోజకవర్గం నుంచి. రెండోసారి తనను గెలిపించిన ప్రజల్ని బాలకృష్ణ ఎంత బాద్యతగా చూసుకోవాలి.? కానీ, మొదటిసారి ఎలాగైతే ఎమ్మెల్యే బాలకృష్ణ, తనను గెలిపించిన హిందూపురం ప్రజల్ని లైట్ తీసుకున్నారో, రెండోసారి అంతకన్నా దారుణంగా లైట్ తీసుకున్నారు.

‘మా ఎమ్మెల్యే కనిపించడంలేదు..’ అంటూ బాలయ్య పేరుని పశువుల శరీరాలపై రాసి హిందూపురం ప్రజలు గతంలో నిరసన వ్యక్తం చేశారు. అంతేనా, ఖాళీ బిందెలు పట్టుకుని మహిళలూ బాలయ్యను నిలదీసే ప్రయత్నం చేశారు. అయినా, బాలయ్యలో మార్పు లేదు.

ఎప్పుడన్నా బాలయ్య పొరపాటున హిందూపురం నియోజకవర్గానికి వచ్చారో టీడీపీ కార్యకర్తలకో, బాలయ్య అభిమానులకో చెంప పగలాల్సిందేననే భావన ఒకటి వుంది. అంతలా బాలయ్య సొంత నియోజకవర్గానికి ‘చుట్టపు చూపు’గా వచ్చి ‘అల్లరి’ చేస్తుంటారు.

ప్రస్తుతం ‘అఖండ’ సినిమా వ్యవహారాల్లో, విజయగర్వంతో బిజీగా వున్న బాలయ్య, కాస్త ఖాళీ చేసుకుని హిందూపురం నియోజకవర్గం మీద కూడా ఫోకస్ పెడితే బావుంటుందేమో.!