వైరల్ : చాన్నాళ్ళకి రియల్ లుక్ లో కనిపించిన బాలయ్య.. 

టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ హీరోగా ఇప్పుడు నటించిన లేటెస్ట్ సినిమా “భగవంత్ కేసరి” తో కెరీర్ లో అదిరే విజయాన్ని అందుకోగా ఈ చిత్రంతో అయితే బాలయ్య తన కెరీర్ లో హ్యాట్రిక్ భారీ హిట్స్ ని కొట్టారు. ఇలా వరుస విజయాలు అలాగే రానున్న రోజుల్లో కొన్ని ఊహించని కాంబినేషన్ లు కూడా బాలయ్య సెట్ చేస్తూ దూసుకెళ్తున్నారు.

అయితే గడిచిన ఇన్నాళ్లలో కూడా బాలయ్యని ఆఫ్ లైన్ లో అయితే తన రియల్ లుక్ లో చూసింది. చాలా తక్కువే అని చెప్పాలి. “అఖండ” చిత్రంలో తన రియల్ లుక్ ఒక పాత్రకి గాను చేశారు కానీ ఆ సమయంలో కూడా బాలయ్య అదే లుక్ లో బయట కనిపించింది లేదు.

అంతకు ముందు ఎప్పుడో కొన్నేళ్ల కితం బయట కూడా బాలయ్య తన రియల్ హెయిర్ తోనే తిరిగేసే వారు కానీ తర్వాత మాత్రం విగ్ మైంటైన్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అయితే బాలయ్య తన రియల్ లుక్ లో కనిపించడం ఇప్పుడు రేర్ థింగ్ అండ్ వైరల్ గా మారింది.

అయితే బాలయ్య ఇప్పుడు ప్రత్యేక పూజని నిర్వహించగా అందుకోసం బాలయ్య తన విగ్ ని పక్కన పెట్టేసారు. దీనితో ఆఫ్ లైన్ లో మళ్ళీ చాన్నాళ్ల తర్వాత బాలయ్యని రియల్ లుక్ లో చూసినట్టు అయ్యింది. దీనితో ఈ పిక్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నడుమ వైరల్ గా మారాయి. ప్రస్తుతం అయితే బాలయ్య భగవంత్ కేసరి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుండగా తన పాలిటిక్స్ సినిమాల్లో కూడా బిజీగా ఉన్నారు. 
https://x.com/Balayya_Garu/status/1719248887838282186?s=20