Hanuman Temple: కర్ణాటక ఆంజనేయ స్వామి ఆలయం గురించి తెలిస్తే ఆశ్చర్య పోతారు!

Hanuman Temple: మహా రామభక్తుడైన శ్రీ ఆంజనేయ స్వామికి దేశంలో అనేక ఆలయాలు ఉన్నాయి. అలాంటి విశేష కరమైన ఆలయాలలో కర్ణాటకలో తులసి గిరి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఒకటి. కేరళ రాష్ట్రానికి చెందిన ఆదిశంకరాచార్యులు హిందూ మతాన్ని స్థాపించడంలో ఆదిశంకరాచార్యులు ప్రథముడిగా ఉన్నాడు.ఈయన అనేక రకాల దేవాలయాలను సృష్టించాడు. అందులో ఈ ఆలయం ఒకటి. ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం. శంకరాచార్యులు హిందూ మతాన్ని కన్యాకుమారి నుంచి జమ్ము కాశ్మీర్ వరకు వ్యాప్తి చేయడంలో చాలా కృషి చేశారు. ఈయన దాదాపు 7,8వ శతాబ్దంలో జన్మించి ఉంటారని. ప్రజలు నమ్మేవారు.

శంకరాచార్యులు స్వయంగా శివుని మరో రూపంగా భక్తులు భావిస్తారు. ఆయన శిష్యులతో కలిసి కాలినడకన భారతదేశంలో అనేక దేవాలయాలను సందర్శించారు. ఈయన ఆంజనేయ స్వామి దేవాలయాన్ని. భారతదేశంలోని పడమటి కర్ణాటక రాష్ట్రంలో ఎత్తైన పర్వతాలు, లోయలు, అడవులతో ఆకర్షించే పవిత్ర శృంగేరి లో ప్రతిష్టించారు. ఈ ఆలయాన్ని కేరే ఆంజనేయస్వామి దేవాలయం అని కూడా పిలుస్తారు. కేరే అంటే కన్నడ భాషలో సరస్సు అని అర్థం. ఈ సరస్సు ఒడ్డున ఈ ఆలయం ఉంది. ఈ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించడానికి పర్యాటకులు వేల సంఖ్యలో వస్తుంటారు. ఈ దేవాలయం చూడటానికి చిన్నదైన చాలా అందంగా ఉంటుంది.

ఆలయం చుట్టుపక్కల వాతావరణం, ప్రకృతి అందమైన దృశ్యాలు, పర్యాటకుల మనసుకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తాయి. ఈ స్వామిని దర్శించుకోవడానికి ఇరవై ఏడు మెట్లు ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది. శృంగేరి సందర్శనానికి వచ్చిన భక్తులు మొదట ఈ ఆంజనేయస్వామి దేవాలయం సందర్శించిన తర్వాతే మిగతా దేవాలయాలను సందర్శిస్తారు.

ఈ ఆలయంలో ఆంజినేయ స్వామి దక్షిణం వైపు చూస్తూ కుడి చేతితో భక్తులను దీవిస్తూ, ఎడమచేతిలో తామర పుష్పాన్ని ధరించడం ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈ స్వామిని దర్శించిన భక్తులకు బలం, ధైర్యం, ధ్యానం కలుగుతుంది. ఈ దేవాలయంలో శనివారం రోజు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. శృంగేరిలో తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలుగా ఆది శంకర దేవాలయం, మల్లికార్జున వారి ఆలయం, శృంగేరి మఠం, సిరిమనె జలపాతాలు, శారదా దేవి ఆలయం ఇలా పలు ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలు మనసుని ఎంతో హత్తుకునే విధంగా భావనను కలిగిస్తాయి.