ఈ దీపం వెలిగిస్తే మీ దరిద్రం దూరం.. ఉద్యోగం, వ్యాపారం, శాంతి అన్నీ కలిసొస్తాయట..!

హిందూ ఆచారాల్లో కర్పూరానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆలయాల్లోనూ, ఇంట్లో చేసే పూజల్లోనూ దీపంతో పాటు తప్పనిసరిగా కర్పూరాన్ని వెలిగించడం మనకు ఎప్పటి నుంచో సాంప్రదాయంగా వస్తోంది. కానీ ఈ చిన్న తెల్లటి ముక్క వెనుక పెద్ద రహస్యముందా అని చాలా మందికి తెలియదు. పండితులు చెబుతున్న వివరాల ప్రకారం.. కర్పూరం కేవలం కేవలం హారతి మాత్రమేకాదు.. మన జీవితంలో ఉన్న అనేక సమస్యలకు పరిష్కారంగా కూడా పనిచేస్తుందని జ్యోతిషశాస్త్రం, వాస్తు శాస్త్రం నిపుణులు చెబుతున్నారు.

ప్రముఖ జ్యోతిష్కులు చెబుతున్న ప్రకారం, ఉద్యోగం కోసం వెతుకుతున్న వారు స్నానం చేసిన వెంటనే పూజ గదిలో దీపం వెలిగించి కర్పూరాన్ని ఆరాధనగా అర్పిస్తే అడ్డంకులు తొలగి మంచి ఫలితాలు వస్తాయని విశ్వాసం. ఇది ప్రతిరోజూ దీనిని అలవాటు మార్చుకుంటే ఆశించిన ఉద్యోగం త్వరగా లభిస్తుందని నమ్మకం ఉంది. అంతేకాక, ఇప్పటికే ఉద్యోగం లేదా వ్యాపారంలో ఉన్నవారు పురోగతి సాధించాలనుకుంటే కలబంద ఆకులతో కర్పూరాన్ని కలిపి దీపం వెలిగించడం ద్వారా వృత్తిలో స్థిరత్వం వస్తుందని, సంపద చేకూరుతుందని అంటున్నారు.

ఇక ఇంట్లో తరచూ రుణబాధలు, గొడవలు, కలహాలు, అనైక్యత వంటి సమస్యలు ఉంటే, మట్టి దీపంలో మూడు లవంగాలు, ఒక కర్పూరం వేసి దీపం వెలిగించి ప్రదక్షిణ చేయాలని పండితులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వలన చెడు శక్తులు తొలగిపోతాయని, ఇంటికి శాంతి తిరిగి వస్తుందని నమ్మకం.ఆధ్యాత్మిక కోణంలో చూసినా కర్పూరం వాడకం ప్రత్యేకం. దీని వాసన మనసుకు ప్రశాంతతను కలిగించి, పూజ సమయంలో ఒక పవిత్ర వాతావరణాన్ని సృష్టిస్తుంది. శరీరానికి, మనసుకు శుభ్రతను ఇస్తూ, ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది. అందుకే ప్రతి పూజలోనూ కర్పూరం వెలిగించడం తప్పనిసరి భాగమైంది.

పురాణాల్లోనూ కర్పూరాన్ని దేవుని ప్రీతికి సంకేతం గా పేర్కొన్నారు. దీన్ని పవిత్రంగా పరిగణించి మనం ప్రార్థనలో వినియోగిస్తే ఇంటికి శుభం, సౌఖ్యం, ఆరోగ్యం, ఆర్థిక ప్రగతి అన్నీ కలిసొస్తాయని పెద్దలు చెబుతున్నారు. పాతకాలం నుండి వచ్చిన ఈ సంప్రదాయం, ఇప్పటికీ ప్రతి ఇంట్లో కొనసాగుతుండటం వెనుక ఇంతటి లోతైన విశ్వాసం ఉంది. (గమనిక: ఈ కథనం పండితులు అందించిన వివరాల ఆధారంగా రాసినది. దీనిని తెలుగు రాజ్యం ధృవీకరించడం లేదు.)