Biriyani Leaf: బిర్యానీ ఆకుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Biryani Leaf: బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఉండరు . బిర్యానీ వాసనకే కడుపు నిండిపోతుంది. ఆదివారం వచ్చిందంటే చాలు బిర్యాని ఉండాల్సిందే .
ఏ బిర్యాని చేయాలన్న అందులో బిర్యానీ ఆకులు వేయాల్సిందే.. బిర్యానీ ఆకులు వేయటం వల్ల రుచి , సువాసన అద్భుతంగా ఉంటాయి. బిర్యాని ఆకులు వేయటం వల్ల ఆహారం రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి . ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం .

బిర్యానీ ఆకులలో రైబోఫ్లేవిన్ , విటమిన్ బి , పాంటోధెనిక్ ఆమ్లం, ఫైరాడిక్సిన్ పుష్కలంగా ఉంటాయి . ప్రతిరోజు మనం తినే ఆహారంలో బిర్యానీ ఆకులు చేర్చడం వల్ల శరీరంలోని నాడీ వ్యవస్థ పనితీరుపై ప్రభావం చూపుతుంది. బిర్యానీ ఆకులు నాడీ వ్యవస్థ పనితీరు,జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి . బిర్యానీ ఆకులలో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది . గర్భిణీ స్త్రీలకు ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం. అందువల్ల గర్భిణీ స్త్రీలు తాము తినే ఆహార పదార్థాలలో బిర్యానీ ఆకులు చేర్చుకోవడం వల్ల వారికి కావలసిన ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది . ప్రతి 100 గ్రాముల బిర్యానీ ఆకులలో180 గ్రాముల ఫోలిక్ యాసిడ్ ఉంటుంది .

బిర్యానీ ఆకులలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి . వ్యాధి నిరోధక శక్తి పెరగడం వల్ల అనేక రకాల సీజనల్ వ్యాధుల నుండి కాపాడి గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి . బిర్యానీ ఆకుల్లో ఫైటో న్యూట్రియెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల క్యాన్సర్ సమస్యలు దరి చేరనీయదు .

ప్రతిరోజు బిర్యానీ ఆకుల టీ తాగటం వల్ల అధిక బరువు సమస్య నుండి విముక్తి పొందవచ్చు . ఈ టి తాగడం వల్ల తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది . ఈ టీ ఊబకాయం , అధిక బరువు సమస్యలు దూరం చేస్తుంది . ప్రతి రోజు ఈ టీ తాగడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి హైపర్ టెన్షన్ నుండి విముక్తి పొందవచ్చు .

కంటి చూపు సమస్యలతో బాధపడేవారికి కూడా బిర్యానీ ఆకులు చాలా ఉపయోగపడతాయి . బిర్యానీ ఆకులలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడటానికి ఉపయోగపడతాయి . విటమిన్ సి లోపంతో బాధపడేవారు వారు తినే ఆహారంలో ఒక పూట బిర్యానీ ఆకులు చేర్చుకోవడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్ సి లభిస్తుంది . బిర్యాని ఆకులలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు కూడా నయమవుతాయి .