Health Tips: స్త్రీలు ఇంటి పనుల్లోనూ వంట పనుల్లోనూ, ఉద్యోగ పనులలోనూ ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఎంతో ఉత్సాహంగా కూడా ఉంటారు అలాగే వారి బాధ్యతలను కూడా నెరవేరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వీరు కొన్ని అనారోగ్య సమస్యల బారిన పడతారు అయితే ఈ అనారోగ్య సమస్యలు కొన్నిసార్లు ప్రమాదకరమైన వ్యాధులకు దారితీస్తాయి. ముఖ్యంగా స్త్రీలలో ఈ లక్షణాలు కనబడితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.
స్త్రీలలో మనకు ఎక్కువగా కనిపించే సమస్యలు కడుపు నొప్పి, వెన్నునొప్పి, రొమ్ము నొప్పి వంటి సమస్యలు అంతేకాకుండా తొందరగా అలసిపోవడం కూడా చూస్తూ ఉంటాము. అలాంటప్పుడు స్త్రీలలో ఎక్కువగా కనిపించేది రొమ్ము నొప్పి,కడుపు నొప్పి
రొమ్ము నందు వచ్చే సమస్యలను తేలికగా తీసుకోకుండా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఇది ఒక్కోసారి రొమ్ము క్యాన్సర్ గా కూడా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి రొమ్ము ఇంకా చంకలలో ఉండే నొప్పిలేని గడ్డలను, చనుమొనల నుంచి వచ్చే స్రావాలను తేలికగా తీసుకోకండి. అలాగే రొమ్ము నందు మార్పులను గమనించినట్లయితే వెంటనే వైద్యుని సంప్రదించండి. వీటిని నిర్లక్ష్యం చేయడం వలన ఒక్కోసారి అని తొలగించే ప్రమాదం కూడా ఉంటుంది.
అంతేకాకుండా నెలసరి నందు సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ రక్త స్రావం కావడం , నెలసరి సమయం అయిపోయినప్పటికీ రక్తస్రావం ఎక్కువగా జరుగుతున్న, లైంగిక సంపర్కం తర్వాత రక్తస్రావం అవ్వడం ఇవన్నీ కూడా గర్భాశయ క్యాన్సర్ కు సంకేతాలు కావచ్చును. ఇవి ఎన్నో ప్రమాదాలకు కూడా దారి తీయవచ్చును. కాబట్టి మీ దగ్గరలోని గైనకాలజిస్ట్ ను సంప్రదించి క్యాన్సర్ కు తగిన సలహాలను పాటించడం చాలా మంచిది.