2024లో వైసీపీ 51 గెలుచుకోగలుగుతుందా.?

YSRCP Get 51 : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, 2024 ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుచుకోబోతోంది.? 2019లో అయితే 151 సీట్లు వైసీపీకి దక్కాయి.. అసెంబ్లీ నియోజకవర్గాల పరంగా. 22 మంది లోక్ సభ నియోజకవర్గాల నుంచి గెలుపొందారు. టీడీపీకి 23 అసెంబ్లీ సీట్లు, మూడు లోక్ సభ సీట్లు దక్కగా, జనసేనకు ఒకే ఒక్క అసెంబ్లీ సీటు దక్కింది.

మరి, వైసీపీ.. 2024లో ఇంతకు మించిన ఘనవిజయాన్ని నమోదు చేయగలుతుందా.? అంటే, ప్రతిసారీ అద్భుతం జరగడం కష్టమే. 151 సీట్లను నిలబెట్టుకోవడం వైసీపీకి అంత తేలిక కాదు. రాష్ట్రంలో పొలిటికల్ ఈక్వేషన్స్ చాలా మారిపోయాయ్. ముందు ముందు ఇంకా మారిపోతాయ్.!
మూడేళ్ళ పాలనలో వైసీపీ కేవలం సంక్షేమం మీదనే దృష్టిపెట్టింది. ఆ సంక్షేమ ఫలాలు జనానికి అందుతున్నాయనీ, అవి ఓటు బ్యాంకుగా పదిలమవుతుందనీ వైసీపీ నమ్ముతోంది. అయితే, సంక్షేమ ఫలాలు ఇన్‌స్టంట్ వ్యవహారాలు. వాటిని జనం ఎన్నికల వేళ లైట్ తీసుకుంటారని చెప్పడానికి, చంద్రబాబు హయాంలో అమలైన సంక్షేమ పథకాలే నిదర్శనం.

మాజీ మంత్రి కొడాలి నాని, 51 తమవేననీ మిగిలిన 49లో విపక్షాలు లెక్క తేల్చుకోవాలని వ్యాఖ్యానించారు. ఇక్కడ ఆయన ఉద్దేశ్యం 51 శాతం ఓట్లు అని. అయితే, రెండు మూడు శాతం ఓట్ల తేడా.. మొత్తంగా ఎన్నికల ఫలితాల్ని మార్చేస్తుందన్నది నిర్వివాదాంశం.

60 శాతం మంది ఎమ్మెల్యేలపై నెగెటివిటీ వుందని వైసీపీ అంతర్గత సర్వేలే చెబుతున్నాయంటే, వైసీపీ ప్రస్తుత పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.