తెలంగాణలో ఎదురులేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం సీఎం కేసీఆర్ మాత్రమే. కేసీఆర్ ను ఎదురించి నిలబడగలిన, నిలబడే నాయకుడు తెలంగాణలో ఉన్న ఏ ప్రతిపక్ష నాయకుడు లేడు. అలాగే కేసీఆర్ ను ఎదురించే ప్రతిపక్ష పార్టీ లేదు. తెలంగాణలో ఉన్న చాలామంది నేతలు కేసీఆర్ కు ఎదురు వెళ్ళడానికి భయపడుతున్నారు. అయితే ఇప్పుడు కేసీఆర్ కు భయపడే నాయకుల్లో మరో ఇద్దరు నేతలు కూడా చేరారు. వారెవరంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ నేతలు కూడా కేసీఆర్ ను ప్రశ్నించడానికి భయపడుతున్నట్టు ఉన్నారు.
హైదరాబాద్ ఇబ్బందుల్లో ఉంటే బాబు ఏం చేస్తున్నాడో!!
హైదరాబాద్ ను తానే నిర్మించానని, హైదరాబాద్ ప్రపంచం గుర్తించే స్థాయికి తానే తీసుకెళ్లానని చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ మొత్తం వరదాల్లో మునిగిపోతుంటే చంద్రబాబు నాయుడు మాత్రం ఉలుకూపలుకు లేకుండా ఉన్నారు. టీడీపీ తెలంగాణలో కూడా రాజకీయాలు చేస్తుంది, అలాంటప్పుడు ప్రభుత్వ లోపం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఎందుకు మౌనంగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఈ మౌనం వెనక, ప్రశ్నించపోవడం వెనక కేసీఆర్ అంటే భయం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వైసీపీ ప్రభుత్వం చిన్న తప్పు చేసినా కూడా విరుచుకుపడుతున్న చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఎందుకు కేసీఆర్ ను ప్రశ్నించడం లేదని తెలంగాణ టీడీపీ నేతలు కూడా గుసగుసలాడుకుంటున్నారు.
పవన్ కూడా మౌనమే వహిస్తున్నాడుగా!!
పవన్ కళ్యాణ్ సినీ మెళకువలు అణా చిరంజీవి దగ్గర నేర్చుకుంటే రాజకీయ మెళకువలు మాత్రం చంద్రబాబు నాయుడు దగ్గరే నేర్చుకున్నాడని చెప్పాలి. ఏపీలో ఎక్కడ ఈ తప్పు జరిగినా, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా చాలాసార్లు వైసీపీ ప్రభుత్వం కంటే కూడా ముందే పవన్ కళ్యాణ్ స్పందిస్తారు. ప్రభుత్వంపై ప్రశ్నలు సందిస్తారు. కానీ తెలంగాణలో మాత్రం వరదల విషయంలో ప్రభుత్వం యొక్క తప్పును ఎందుకు ప్రశ్నించడం లేదో అర్ధం కావడం లేదు. అలాగే రెండు రాష్ట్రాల మధ్య బస్సులు తిరకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే పవన్, ఈ విషయంలో మొండి వైఖరిని ప్రదర్శిస్తున్న కేసీఆర్ ను ఎందుకు ప్రశ్నించడం లేదని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.