ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పరిస్థితి గురించి చెప్పాల్సిన పనిలేదు. ఓవైపు కీలక నేతలు అరెస్ట్ అవుతున్నారు. మరో వైపు కేసులు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. పరిస్థితిని ముందే ఊహించిన నేతలు సైకిల్ దిగి ప్యాన్ కిందకు వచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఫ్యాన్ గాలి వద్దనుకున్న వాళ్లంతా కమలoవైపు మొగ్గు చూపుతున్నారు. ఇలా ఎవరికి వారు చంద్రబాబుని ఒంటరివాడిని చేసేస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు చేయాల్సిందేటి? యువతను ప్రోత్సహించడం. మరి చంద్రబాబు నాయుడు ఆ పని చేయలేదా? అంటే అలా అనడానికి వీలు లేదు. పార్టీ కోసం ఆయన యువతని కూడా బాగానే ప్రోత్సహిస్తున్నారు.
శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చి పార్టీలో చేర్చుకుంటున్నారు. కానీ ఆ తర్వాత సీన్ రివర్స్ అవుతుంది. కొంత మంది యువకులు పార్టీలు యాక్టివ్ గా ఉన్నా..ఇంకొంత మంది పార్టీని పట్టించు కోకుండా…ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దాం లే అని లైట్ తీసుకుంటున్నారుట. అందుకు కారణంగా పార్టీ అదిష్టానం సరిగ్గా పట్టించుకోకపోవడమేనని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజక వర్గం యువ నాయకురాలు, మాజీ స్పీకర్ ప్రతిబాభారతి కుమార్తె గ్రీష్మ పగ్గాలిస్తే స్థానికంగా పరుగులు పెట్టిస్తానన్నా పట్టించుకోవడం లేదు.
గుంటూరు జిల్లాలో రాయపాటి సాంబశివరావు తనయుడు రంగారావుది అదే పరిస్థితి. ఇంకా శ్రీకాళహస్తి సహా అనంతపురం జిల్లాలోనూ ఇదే పరిస్థితి అని అంటున్నారు. ఇక నిజాయితీగా పార్టీ బాద్యతలు నెత్తికెత్తుకుందామని చూసినా జిల్లాల్లో సీనియర్లు ఈగోలు దెబ్బ తినే పరిస్థితి. ఇలా కొంత మంది యువ నేతలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. ఇంకొంత మంది చంద్రబాబు ముఖం మీదనే మీ బాధలేవో మీరు పడండి..ఇప్పటివరకూ ఇచ్చిన సహకారం చాలంటూ అసంతృప్తితో జారుకుంటున్నారుట. మరి ఈ ఫేజ్ ని దాటుకుని చంద్రబాబు ఎలా బయటకు వస్తారో.