Ram Gopal Varma : జగన్ సర్కారుపై ఆర్జీవీ నజర్: తెరవెనుక ఆడిస్తున్నదెవరు.?

Ram Gopal Varma : ఎప్పుడూ ఎవరో ఒకరు పట్టుకుని ఆడిస్తే తప్ప ఆడని వ్యక్తిగా రామ్ గోపాల్ వర్మ ఎప్పుడో మారిపోయారన్నది సినీ పరిశ్రమలో, రాజకీయ వర్గాల్లో బలంగా వినిపించే వాదన. పవన్ కళ్యాణ్ మీదా, చంద్రబాబు మీదా విమర్శలు చేసినా, ఈ క్రమంలో సోషల్ మీడియాలో అడ్డగోలు ట్వీట్లేయడం దగ్గర్నుంచి, వారి మీద సినిమాలు తీసినా.. అదంతా ‘పెయిడ్’ వ్యవహారమే.!

మరిప్పుడు, రామ్ గోపాల్ వర్మ.. అనూహ్యంగా వైఎస్ జగన్ సర్కారు మీద గుస్సా అవుతున్నారు. మరిప్పుడు, ఆర్జీవీ వెనుక ఎవరు వున్నట్టు.? సినిమా టిక్కెట్ల వ్యవహారానికి సంబంధించి గత కొద్ది రోజులుగా రచ్చ జరుగుతోంటే, కాస్త తీరిగ్గా ఈ విషయంలో కలగజేసుకున్నారు వర్మ.

నిజానికి, వర్మకీ.. సినిమా థియేటర్లకీ మధ్య సంబంధం కొన్నాళ్ళ క్రితమే దాదాపుగా తెగిపోయింది. యూట్యూబ్ లేదా ఓటీటీ అలాగే ఏటీటీ వంటి వేదికలకే వర్మ పరిమితమైపోయిన సంగతి తెల్సిందే. ఏవో బూతు సినిమాలు, వివాదాస్పద సినిమాలు తీసుకుంటూ టైమ్ పాస్ చేస్తున్న వర్మ, అనూహ్యంగా.. సినిమాల గురించి ‘పద్ధతైన వ్యక్తి’గా మాట్లాడేస్తున్నారు.

ఇంతకీ వర్మ వెనకాల వున్నదెవరు.? ఈ ప్రశ్న చుట్టూ సినీ, రాజకీయ వర్గాల్లో చాలా చర్చ జరుగుతోంది. మామూలుగా అయితే జగన్ సర్కారుని ఎవరన్నా నిలదీస్తే, వైఎస్ జగన్ మద్దతుదారులు బూతులతో విరుచుకుపడిపోతారు. కానీ, అలాంటి పరిస్థితి వర్మ విషయంలో కనిపించడంలేదు.
వర్మ మీద ట్రోలింగ్ కూడా సోషల్ మీడియాలో పెద్దగా జరగకపోవడం కొత్త అనుమానాలకు తావిస్తోంది.