జబర్దస్త్ కమెడియన్ నూకరాజు గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట జీ తెలుగులో ప్రసారమైన కిలాడి కామెడీ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన నూకరాజు ఆ తర్వాత ఈటీవీ ప్లస్ లో ప్రసారమైన పటాస్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత జబర్దస్త్ లో అవకాశం దక్కించుకుని జబర్దస్త్ ద్వారా మరింత పాపులర్ అయ్యాడు. నూకరాజు ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్,శ్రీదేవి డ్రామా కంపెనీ షోల ద్వార ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నూకరాజు తన వ్యక్తిగత విషయాల గురించి చెప్పుకొచ్చాడు.
ఈ సందర్భంగా నూకరాజు మాట్లాడుతూ.. మొదట జబర్దస్త్ కామెడీ షో చూసినప్పుడు హైదరాబాద్ వెళ్లి అక్కడ వారిని ఒకసారి కలిస్తే చాలు అని అనుకున్నాను. కానీ నీ ఊర్లో ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు నేను వేసే పంచ్ లు చూసి నువ్వు జబర్ధస్త్ లాంటి షో లకి వెళ్తే మంచి ఫ్యూచర్ ఉంటుందని నా ఫ్రెండ్స్ చెప్పేవారు. దీంతో నేను హైదరాబాద్ కి వచ్చి అవకాశాల కోసం చాలా కాలం తిరిగాను. ఈ క్రమంలో నేను చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు. అవకాశాల కోసం వెళితే కొందరు చాలా నీచంగా మాట్లాడి వెళ్ళిపోమని చెప్పేవారు, మరికొందరైతే ఏకంగా మెడ పట్టుకుని బయటికి గెంటేశారు.. అంటూ నూకరాజు చెప్పుకొచ్చాడు.
అయినా కూడా అలాగే ప్రయత్నాలు చేస్తున్న సమయంలో మొదట జీ తెలుగులో ప్రసారమైన కిలాడి కామెడీ షో లో అవకాశం వచ్చింది. ఆ తర్వాత పటాస్, జబర్దస్త్ ఇలా టీవీ షో లతో ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. మొదట జబర్ధస్త్ లో ఒక స్కిట్ చేస్తే చాలు అనుకున్నా.. కానీ ఇప్పుడూ ప్రతివారం జబర్ధస్త్ లో స్కిట్ లు చేస్తున్నా. అంతే కాకుండా ఇటీవల శ్రీదేవీ డ్రామా కంపెనీ లో అవకాశం రావడంతో మరింత బిజిగా ఉన్నాను అంటూ నూకరాజు చెప్పుకొచ్చాడు. నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలని నా కల . ఒకవేళ నాకు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చినా కూడా ఎట్టిపరిస్థతుల్లోనూ బుల్లితెరని వదిలి వెళ్ళను అంటూ చెప్పుకొచ్చాడు.