కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం

pawan kalyan

  తెలంగాణ లో బీజేపీ పార్టీ ఎలాగైనా సరే 2023 ఎన్నికల నాటికీ అధికారం దక్కించుకోవాలని చూస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణ లో బీజేపీ పరిస్థితి మెరుగ్గా ఉంది. ఇక్కడ బీజేపీ నేతలు కూడా గట్టిగా పోరాటం చేయగలిగిన సత్తా ఉన్నవాళ్లే, వాళ్లకు అండగా నిలబడితే చాలు కేసీఆర్ ను ధీటుగా ఎదురుకోవచ్చనే ఆలోచనలో బీజేపీ అగ్రనాయకత్వం ఉంది. అందుకే తెలంగాణ మీద ఫోకస్ పెట్టింది. తాజాగా జరుగుతున్నా దుబ్బాక ఎన్నికల్లో విజయం సాధిస్తే తెలంగాణలో పార్టీకి అది చాలా సానుకూలాంశం అవుతుందని భావించి, గెలుపు కోసం అన్ని వనరులను ఉపయోగించుకోవాలని చూస్తుంది.

pawan kalyan

  అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ను ఎన్నికల ప్రచారంలోకి దించాలని భావించి ఢిల్లీ స్థాయిలో మంతనాలు జరుపుతున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. ఢిల్లీ నుండి ఫోన్ వస్తే పవన్ కళ్యాణ్ కచ్చితంగా ప్రచారానికి వస్తాడు. పొత్తు ధర్మం మేరకు కనీసం ఈ విధంగా కూడా పార్టీకి సహాయం చేయకపోతే ఇంకా పొత్తు ఎందుకు అనే మాటలు వినవస్తాయి, కాబట్టి పవన్ ప్రచారం చేయక తప్పదు. ప్రచారం మొదలుపెడితే విమర్శలు చేయటం సహజం. తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే పవన్ కళ్యాణ్ కి భయంతో కూడుకున్న గౌరవం ఉంటుంది. మర్చిపోయి కూడా కేసీఆర్ పై విమర్శలు చేసే సాహసం జనసేన అధినేత ఎప్పుడు చేయలేదు.

  ఆంధ్ర సీఎం జగన్ నిర్ణయాలను అడుగడునా తప్పు పడుతూ, రాష్ట్రంలో ఎలాంటి సంఘటన జరిగిన దానికి జగనే కారణమంటూ మాట్లాడే పవన్ కళ్యాణ్, తెలంగాణలో ఎన్ని సంఘటనలు జరిగిన దానికి ప్రభుత్వాన్ని , కేసీఆర్ ను ఒక మాట మాట్లాడకుండా ఉంటాడు. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ మీద విమర్శలు చేయాల్సి రావటంతో తెగ ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది. ప్రచారానికి వెళ్లకపోతే బీజేపీ కి కోపం , ప్రచారానికి వెళ్లి తెరాస ను పొగడటం జరిగే పని కాదు.. దీనితో పాపం పవన్ కళ్యాణ్ కు ఏమి చేయాలో పాలుపోవటం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. మనం పైన చెప్పుకున్న సామెత సరిగ్గా సరిపోతుంది జనసేన అధినేతకు