AP: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జనవరి 8వ తేదీ విశాఖపట్నం పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ పర్యటనలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా మంత్రి నారా లోకేష్ ఏర్పాట్లు అన్నింటిని కూడా పరిశీలిస్తున్నారు. ఇలా నరేంద్ర మోడీ విశాఖపట్నంలో భాగంగా కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయబోతున్నారని తెలుస్తుంది అదే విధంగా ఈయన ఏపీ పర్యటన కూడా కాస్త ప్రాధాన్యతలు సంతరించుకుందని చెప్పాలి.
ఇలా నరేంద్ర మోడీ ఏపీకి రావడం వెనక పెద్ద రాజకీయ వ్యూహం ఉందని కొందరు రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. నరేంద్ర మోడీ ఏపీలో తన గేమ్ మొదలు పెట్టారని ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ ను పావుగా వాడుకొని చంద్రబాబు నాయుడుని తన కంట్రోల్లో ఉంచుకున్నారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికలలో బిజెపి పార్టీకి అనుకున్న స్థాయిలో సీట్లు రాలేదు దీంతో బీహార్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయం తీసుకొని ఆయన కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ఇలా ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహాయం తీసుకున్న నరేంద్ర మోడీ వారికి అనుకూలంగా ఉన్నారు అనుకుంటే అది పూర్తిగా తప్పని చెప్పాలి.తనకు ఇబ్బందిగా మారతారనుకున్న వారిని మోదీ కట్టడి చేయడానికే ఎక్కువ ప్రయత్నం చేస్తారన్నది దాదాపు దశాబ్దన్నర జాతీయ రాజకీయాలు చూసిన వారికి స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఎంతో రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వంటి వారిని కంట్రోల్ చేయడం ఎంతో అవసరమని మోడీ భావించినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు పొత్తు నుంచి బయటకు వెళ్లకుండా ఉండడం కోసం మోడీ సరికొత్త వ్యూహం రచించారనే చెప్పాలి. అందులో భాగంగానే పవన్ కల్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ లో హైలెట్ చేయాలని మోదీ భావిస్తున్నారు. చంద్రబాబు గతంలో మాదిరిగా మోదీని డిమాండ్ చేయలేరు. ఎందుకంటే ఏపీలో పవన్ అవసరం చంద్రబాబుకు ఉంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా మరోసారి పవన్ తో కలసి ప్రయాణం చేస్తేనే అధికారం దక్కుతుంది. ఆ వీక్ నెస్ తోనే పవన్ ను మోదీ మంచి చేసుకున్నారు దీంతో ఛాన్స్ దొరికిన ప్రతిసారి పవన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
చంద్రబాబు రాజకీయ చాణక్యుడు అయితే.. మోదీ అంతకు మించి. చంద్రబాబు భయం కూడా అదే. మోదీని వదిలి పవన్ బయటకు రారు. అలా ఫిక్స్ చేయడంలో నరేంద్ర మోదీ ఇప్పటికే సక్సెస్ అయినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా దక్షిణాదిలో పట్టు సాధించడం కోసం మోడీ అసలైన గేమ్ మొదలు పెట్టారని అందుకు పవన్ కళ్యాణ్ ను పావుగా వాడుతున్నారని స్పష్టం అవుతుంది.