Kiran Kumar Reddy: సీఎం పదవి కోసం ఎవరిని అడుక్కోలేదు… ఎవరికి కప్పు కాఫీ ఇవ్వలేదు: కిరణ్ కుమార్ రెడ్డి

Kiran Kumar Reddy: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత ఆపధర్మ ముఖ్యమంత్రిగా రోశయ్య బాధ్యతలను తీసుకున్నారు అయితే మూడు నెలల తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలను నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేపట్టారు. ఇక ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014వ సంవత్సరంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్నారు.

ఇలా తెలంగాణ విడిపోవడంతో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ పార్టీలోకి చేరారు. అయితే గత ఎన్నికలలో కూడా ఈయన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయగా పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం నెల్లూరు పర్యటనలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన సీఎం పదవి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

గతంలో తాను ముఖ్యమంత్రి పదవిని పొందడం కోసం ఎవరిని కూడా అడ్డుకోలేదని తెలిపారు. అలాగే తనకు ముఖ్యమంత్రి పదవి కావాలి అంటూ ఏ ఒక్కరికి కూడా కప్పు టీ ఇవ్వలేదని తెలిపారు.కానీ, పదవి వచ్చినప్పుడు ప్రజలకు ఎలా మేలు చేయాలనేది ఆలోచించాను.. అంతేకాదు.. ప్రజలకు మేలు చేయాలనే తలంపుతోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధిష్టానానికి నేను ఎన్నోసార్లు చెప్పిన వాళ్ళు వినకపోవడంతోనే మీడియా ముందుకు వచ్చానని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోడీని మూడు నెలల ముందు కలిసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది అన్నారు కిరణ్‌కుమార్‌.. ఇప్పటికీ కృష్ణా జలాలకు సంబంధించి ఇరు రాష్ట్రాలకూ సమస్య ఉందనీ తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ కు పోలవరం పెద్దవరం అని తెలిపారు. పోలవరం పనులను త్వరగా పూర్తి చేసుకోవాలి. 23 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, 7 లక్షల 20 వేల ఎకరాల కొత్త ఆయకట్టు, 900 మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి పోలవరంతోనే సాధ్యం అవుతుందన్నారు. ఇక ప్రస్తుత ఏపీ పరిస్థితి గురించి కూడా ఈయన స్పందించారు. ఏపీ అప్పుల కుప్పగా మారిపోయింది అంటూ కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్లు చేశారు.