ఈ సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే బొప్పాయికి దూరంగా ఉండాల్సిందే?

బొప్పాయి పండు తినటానికి రుచిగా ఉంటుంది. అలాగే బొప్పాయి పండు తినటం వల్ల మన ఆరోగ్యానికి, అందానికి కూడా ఉపయోగపడుతుంది. బొప్పాయి పండులో అనేక రకాల పోషకాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. బొప్పాయి పండు తినటం వల్ల మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే కొద్దిమంది బొప్పాయి తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బొప్పాయి పండు అసలు తినకూడదు. జనరల్ గా బొప్పాయి పండు వేడి స్వభావం కలిగి ఉంటుంది. ప్రెగ్నెంట్ సమయంలో బొప్పాయి తినడం వల్ల వేడికి అబార్షన్ అయ్యే ప్రమాదం ఉంది. అలాగే కడుపులో బిడ్డకి కూడా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల గర్భధారణ సమయంలో బొప్పాయి పండు తినకూడదని డాక్టర్ చెబుతుంటారు.అలాగే బొప్పాయి పండు తినడం వల్ల కిడ్నీ సమస్యలు కూడా తలెత్తుతాయి. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవారు బొప్పాయి పండు తింటే బొప్పాయి పండులో విటమిన్- సి ఉండటం వల్ల కిడ్నీలో రాళ్లు ఉన్నవారు మరింత సమస్యను ఎదుర్కొంటారు.

కొద్దిమందికి కొన్ని రకాల ఫ్రూట్స్ తినటం వల్ల అలర్జీ ఉంటుంది. అలాగే కే లాటెక్స్ అలర్జీ ఉన్నవారు బొప్పాయి పండు తింటే చాలా ప్రమాదం. బొప్పాయి పండులోని ఎంజైమ్‌లు శరీరంలో క్రాస్ రియాక్షన్ కలిగిస్తాయి. దీనివలన బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
షుగర్ వ్యాధితో బాధపడే వారు కూడా బొప్పాయి పండ్లు తినటం వారి ఆరోగ్యానికి హానికరం. హార్ట్ బీట్ ఎక్కువగా ఉన్నవారు బొప్పాయి పండు తినడం వల్ల చాలా ప్రమాదం.