Alcohol: ప్రస్తుత కాలంలో మద్యపానం సేవించటం అందరికీ వ్యసనంగా మారిపోయింది.. వయసు వ్యత్యాసం లేకుండా యుక్తవయసు ఉన్న వారి నుండి ముసలివారి వరకు మద్యపానం సేవించడం బాగా అలవాటయిపోయింది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని డాక్టర్లు ఎంత చెప్పినా ఆ అలవాటు మానలేక పోతున్నారు. చాలామంది తాము ప్రతిరోజు మద్యపానం చాలా తక్కువగా తీసుకుంటున్నామని , మద్యపానం మితంగా తీసుకోవటం ఆరోగ్యానికి మంచిదని చెప్పుకొస్తున్నారు.. మద్యపానం తక్కువగా తీసుకున్నప్పటికీ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వెంటనే రాకపోయినా నిదానంగా శరీరంలో అన్ని అవయవాల మీద దాని ప్రభావం చూపుతుంది. మద్యపానం మితంగా సేవించడం వల్ల బ్లడ్ ప్రెజర్ , గుండె సంబంధిత వ్యాధులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఆల్కహాల్ తాగటం వల్ల అందులో రక్తహీనత ఎక్కువగా ఉండి తెల్ల రక్త కణాల శాతం తగ్గేలా చేస్తుంది. శరీరంలో తెల్ల రక్త కణాలు తగ్గటం వల్ల వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లి తరచూ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మద్యపానం సేవించడం వల్ల శరీరంలో యూరిక్ ఆమ్లం తగ్గి జాయింట్ పెయిన్స్ వచ్చే ప్రమాదం ఉంది.
మద్యపానం మొదటిలో తక్కువ పరిమాణంలో తాగినా.. రోజులు గడిచే కొద్దీ మద్యపానం సేవించడం వ్యసనంగా మారుతుంది. ఇలా జరగటం వల్ల క్యాన్సర్ సమస్యలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆల్కహాల్ సేవించటం వల్ల మెదడు పనితీరు సన్నగిల్లుతుంది. ప్రతిరోజు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల మద్యపానానికి దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.