ప్రమాదవ శాత్తు జరిగిన ఫైర్ ఘటనలపై విషం చిమ్మారు. పరవాడ ఫార్మా ఇండస్ర్టీపై ఆరోపణలు గుప్పించారు. హెచ్ పీసీఎల్ పై…చివరికి ఎప్పుడో మూసేసిన జింక్ ఫ్యాక్టరీపై కూడా పడ్డారంటే! పసుపు నేతలు ఎంతగా కక్ష సాధింపుకు పూనుకున్నారో? అద్దం పట్టడం లేదా. ఇవన్నీ కాకపోయే సరికి విశాఖలో సునామీ వస్తుందన్నారు…విశాఖలో భూకంపాలు వస్తాయన్నారు…రాజధానికి అనుకూలమైన ప్రాంతం కాదన్నారు. సముద్ర గర్భంలో చీలిక ఏర్పడిందని తమ అనుకూల డమ్మీ సైంటిస్ట్ ని తీసుకొచ్చి ఆ రకంగాను భంగపడ్డారు పచ్చ నేతలు. ఇది కూడా అంత బలంగా నిలబడని ఆరోపణగానే మిగిలిపోయింది. టీడీపీ చేసిన ఈ కుట్రలన్నింటిని వైసీపీ ఎప్పకప్పుడు భగ్నం చేసుకుంటూ వచ్చింది.
అందుకే ఇప్పుడు టీడీపీ కొత్త పాఠ మొదలు పెట్టింది. విశాఖలో 30 ఎకరాల స్థలంలో ప్రభుత్వం గెస్ట్ హౌస్ నిర్మాణానికి పూనుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ ప్రాంతంలో బౌద్ధుల ఆనవాళ్లు ఉన్నాయని, వాటిని తొలగించి గెస్ట్ హౌస్ నిర్మాణం చేపట్టబో తున్నారని ప్రతిపక్ష పార్టీ ఆరోపిస్తోంది. చేయాల్సిన ఆరోపణల్ని అయిపోయే సరికి ఇలా తెగబడుతున్నారు పసుపు నేతలు. చివరికి బౌద్ధ సంఘాల్ని సైతం రంగంలో దింపే యత్నం , రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీటిపై జగన్ సర్కార్ వివరణ ఇవ్వడం జరిగింది. బౌద్ధుల పవిత్ర స్థలానికి….ఈ గెస్ట్ హౌస్ కు ఎంత మాత్రం సంబంధం లేదని రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే టీడీపీ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు.