AP: ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా ఒక్కసారిగా ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది. విజయసాయిరెడ్డి ఇలా రాజీనామా చేయడంతో రాజీనామా వెనుక గల కారణాలు ఏంటి అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. అసలు ఈయన రాజీనామా చేయటం వెనుక జగన్ అంతర్గత వ్యూహం ఉందని మరికొందరు భావిస్తున్నారు అయితే నేడు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం విజయ్ సాయి రెడ్డి ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఎన్నో విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ నేను రాజకీయాలకు రాజీనామా చేయడం వెనుక ఎవరి ప్రోద్బలం లేదని తెలిపారు. అదే విధంగా నా ఇష్టప్రకారమే తాను రాజకీయాల నుంచి బయటకు వస్తున్నానని రాజకీయాల తర్వాత వ్యవసాయం చేసుకుంటూ మిగతా జీవితాన్ని గడపాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.. జగన్ లండన్ పర్యటనలో ఉండగా ఈయన రాజీనామా చేయటం వెనుక కారణమేంటని ప్రశ్నించడంతో జగన్మోహన్ రెడ్డికి ఫోన్ ద్వారా అన్ని విషయాలు తెలియజేశారని ఆయనతో మాట్లాడిన తరువాతనే రాజీనామా చేసానని తెలిపారు.
జగన్మోహన్ రెడ్డి చాలా మంచి వ్యక్తి, నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే వైఎస్ కుటుంబమే కారణమని నాకు వైఎస్ కుటుంబంతో ఈ జీవితంలో ఎప్పటికీ విభేదాలు రావని తెలిపారు. ఇలా తన రాజకీయానికి గుడ్ బై చెప్పటానికి గల కారణాలను ఈయన తెలియజేశారు ఈ క్రమంలోనే మీడియా రిపోర్టర్స్ మాట్లాడుతూ మీపై పెట్టిన కేసుల నుంచి బయటపడటం కోసమే మీరు రాజీనామా చేస్తున్నారా అని ప్రశ్నలు వేశారు.
ఈ ప్రశ్నకు విజయసాయిరెడ్డి సమాధానం చెబుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాపై ఎన్నో అక్రమంగా కేసులు వేశారు నన్ను అప్రూవర్ గా మారాలని ఒత్తిడి చేశారు కానీ నేను అప్రూవర్ గా మారలేదని తెలిపారు. ఇక నాపై పెట్టిన కేసుల నుంచి బయటపడటం కోసమే నేను రాజకీయాలకు రాజీనామా చేస్తే ఇప్పుడు మరింత బలహీనుడిని అవుతాను నాపై చర్యలు తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అయితే నేను కేసులకు భయపడి రాజీనామా చేయలేదు అంటూ విజయ్ సాయి రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను ఒక్కడినే రాజీనామా చేసి బయటకు వచ్చినంత మాత్రాన జగన్ కి ఏమాత్రం ప్రజాదరణ తగ్గదని ఈయన తెలిపారు.