Gallery

Home News లైగ‌ర్ సెట్‌లో ప‌డుకుంటాన‌ని పూరీ జ‌గ‌న్నాథ్‌కు చెప్పిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

లైగ‌ర్ సెట్‌లో ప‌డుకుంటాన‌ని పూరీ జ‌గ‌న్నాథ్‌కు చెప్పిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

అర్జున్ రెడ్డి చిత్రంకు ముందు పలు చిత్రాల‌లో న‌టించిన పెద్ద‌గా గుర్తింపు తెచ్చుకోని విజ‌య్ దేవ‌ర‌కొండ అర్జున్ రెడ్డితో దేశ వ్యాప్తంగా ఆద‌ర‌ణ పొందాడు. ఈ చిత్రంలో అత‌ని లుక్, బాడీ లాంగ్వేజ్, న‌ట‌న ప్ర‌తి ఒక్క‌రి మ‌న‌స్సుల‌ని క‌ట్టిప‌డేసింది. అర్జున్ రెడ్డి చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ మాదిరిగా మ‌రే హీరో న‌టించ‌లేడ‌నే కామెంట్స్ కూడా వినిపించాయి. అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీ, త‌మిళంలో రీమేక్ చేసిన‌ప్ప‌టికీ విజయ్ దేవ‌ర‌కొండ‌కు వ‌చ్చిన పేరైతే రాలేదు. అయితే ఈ సినిమాతో యూత్ సెన్సేష‌న‌ల్ హీరోగా మారిన విజ‌య్ ఆ త‌ర్వాత వైవిధ్య‌మైన చిత్రాలు చేశాడు.

Vi | Telugu Rajyam

ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కత్వంలో లైగ‌ర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డింది. దాదాపు 11నెల‌ల త‌ర్వాత తిరిగి మొద‌లైంది. ముంబైలో ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతుండ‌గా, ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ వ‌స్తుంది ఛార్మి. త‌న‌ బైక్‌పై విజయ్ దేవ‌ర‌కొండ‌ను ఎక్కించుకొని షికార్లు కొట్టిన ఈ ముద్దుగుమ్మ అందుకు సంబంధించిన స్టిల్స్ షేర్ చేయ‌గా, ఇవి ఫుల్ వైర‌ల్ అయ్యాయి.

ఇదిలా ఉండగా.. తాజాగా విజయ్ డైరెక్టర్ పూరీ నాన్ స్టాప్ షూటింగ్ షెడ్యూల్ రెడీ చేయమని చెప్పాడట. లాక్‌డౌన్ వ‌ల‌న కావ‌ల‌సినంత రెస్ట్ దొరికింది. ఇక ఇప్పుడు విరామం లేకుండా వీలైనంత త్వ‌ర‌గా షూటింగ్ పూర్తి చేద్ధామ‌ని అన్నాడ‌ట‌. అవ‌స‌ర‌మైతే నేను నా రూమ్‌కు వెళ్ళ‌కుండా సెట్‌లో ఉంటాన‌ని అన్నాడ‌ని తెలుస్తుంది. విజయ్ డెడికేష‌న్‌కు అభిమానులు తెగ ఫిదా అవుతున్నారు. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ పూరీ జగన్నాథ్ ఛార్మికౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన‌న్య పాండే కథానాయిక‌గా న‌టిస్తుంది.

- Advertisement -

Related Posts

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం.. పార్టీల మధ్యనా.? ప్రభుత్వాల మధ్యనా.?

ఆంధ్రపదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం ఇంకోసారి భగ్గుమంది. రాజకీయ నాయకులు మాట మీద అదుపు కోల్పోతున్నారు. తెలంగాణ నుంచే దూకుడుగా అనవసరపు మాటలు వస్తున్నాయి. ఆంధ్రపదేశ్ నుంచి కాస్త సంయమనమే...

China Spy: భారత్ లో చైనా గూఢచారి..! విచారణలో కలకలం రేపే అంశాలు..

China Spy: ఈనెల రెండో వారంలో బెంగాల్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతం మాల్దా వద్ద ‘హాన్ జున్వే’ అనే చైనా గూఢచారి అరెస్టయిన సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా అతను వెల్లడిస్తున్న విషయాలు కలకలం...

ప్రచారం సరిపోదు.. నేరస్తులపై సీరియస్ ‘యాక్షన్’ వుండాల్సిందే

ఆంధ్రపదేశ్ రాజధాని (వైఎస్ జగన్ ప్రభుత్వం అంగీకరించినా అంగీకరించకపోయినా) అమరావతి పరిధిలో అత్యంత హేయమైన ఘటన జరిగింది. ఓ యువతిపై, ఆమెకు కాబోయే భర్త సమక్షంలోనే లైంగిక దాడి జరిగింది. అదీ, అమరావతిలో.....

Latest News