Bigg Boss 9: బిగ్ బాస్9 హోస్ట్ గా విజయ్ దేవరకొండ… భారీ రెమ్యూనరేషన్ డిమాండ్… కండిషన్స్ అప్లై అంటున్న హీరో?

Bigg Boss 9: బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది.. ఇక ఈ కార్యక్రమం ఇప్పటికే తెలుగులో ఎనిమిది సీజన్లను పూర్తి చేసుకొని తొమ్మిదవ సీజన్లోకి అడుగు పెట్టబోతున్నారు. ఇక తొమ్మిదవ సీజన్ కి సంబంధించిన కార్యక్రమాలు అన్నింటిని మేకర్స్ మొదలు పెట్టారని తెలుస్తుంది. ముఖ్యంగా కంటెస్టెంట్ లో ఎంపిక ప్రక్రియతో పాటు ఈసారి సరికొత్త టాస్కులు అలాగే మరింత కఠిన తరంగా కూడా ఈ సీజన్ నిర్వహించాలని మేకర్స్ భావించినట్టు సమాచారం.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ హోస్ట్ ను కూడా మార్చాలి అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నాగార్జున ఈ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సీజన్ 3 నుంచి కూడా నాగార్జున కొనసాగుతున్నారు మొదటి సీజన్ ఎన్టీఆర్ రెండవ సీజన్ నాని హోస్టుగా వ్యవహరించారు. ఇకపోతే తొమ్మిదవ సీజన్ కి మాత్రం నాగార్జున కాకుండా విజయ్ దేవరకొండను హోస్ట్ గా తీసుకోవాలని మేకర్స్ భావించారట.

ఇదే విషయం గురించి హీరో విజయ్ దేవరకొండను సంప్రదించడంతో ఆయన ఎన్నో కండిషన్లు పెట్టడమే కాకుండా భారీగా రెమ్యూనరేషన్ కూడా డిమాండ్ చేశారని తెలుస్తుంది. ఇక కంటెస్టెంట్ల ఆట తీరు వారి పర్ఫామెన్స్ బట్టి మాత్రమే తాను హోస్టుగా వ్యవహరిస్తాను తప్ప ఒకరికి మాత్రమే సపోర్ట్ చేయమంటే తాను చేయనని తెలిపారట. అంతేకాకుండా ముందుగానే విన్నర్ ని దృష్టిలో పెట్టుకొని వారికి సపోర్ట్ చేయాలనే విధంగా తనపై ఒత్తిడి తీసుకురాకూడదని తెలిపారట.

ఇకపోతే ఈ కార్యక్రమానికి హోస్ట్ గా పాల్గొంటున్నందుకు తనకు 15 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇవ్వాలి అంటూ కూడా డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈయన పెట్టిన కండిషన్లకు ఈయన అడిగిన మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా మేకర్స్ సిద్ధంగా ఉన్నారని సమాచారం. మరి విజయ్ దేవరకొండ హోస్ట్ అంటూ వస్తున్న ఈ వార్తలలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.