Venu Swamy: వేణు స్వామి పరిచయం అవసరం లేని పేరు. ప్రముఖ జ్యోతిష్యులుగా గుర్తింపు పొందిన ఈయన పెద్ద ఎత్తున సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల గురించి అలాగే రాజకీయ నాయకుల గురించి జాతకాలు చెబుతూ వార్తల్లో నిలిచారు. ఇక ఈయన చెప్పిన విధంగానే సెలబ్రిటీలు రాజకీయ నాయకుల విషయంలో నిజం కావటంతో ఈయనని అనుసరించే వారి సంఖ్య ఎక్కువ అయింది అదేవిధంగా ఇండస్ట్రీలో సక్సెస్ కోసం వేణు స్వామి చేత పూజలు చేయించుకున్న సెలబ్రిటీలు కూడా ఉన్నారు.
ఇలా ఒక్కసారిగా వేణు స్వామి ఫేమస్ అవడంతో ఈయన తరచూ సినిమా సెలబ్రిటీల గురించి రాజకీయ నాయకుల గురించి సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. ఈ క్రమంలోని వేణు స్వామి పై పలుమార్లు కేసు కూడా నమోదు అయింది అంతేకాకుండా ఇటీవల జరిగిన ఎన్నికలలో కేసీఆర్ జగన్ మోహన్ రెడ్డి ఇద్దరు గెలుస్తారని చెప్పారు కానీ తన జ్యోతిష్యం నిజం కాలేదు.
ఇలా ఈయన చెప్పిన జాతకాలు నిజం కాకపోవడంతో తాను ఇకపై సెలబ్రిటీల గురించి రాజకీయ నాయకుల గురించి మాట్లాడనని తెలిపారు. అయితే కొంతకాలం పాటు మౌనంగా ఉన్న వేణు స్వామి తిరిగి సెలబ్రిటీల గురించి రాజకీయ నాయకులు గురించి మాట్లాడుతూ మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఒక పొలిటిషయన్ తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నారని తిరిగి ఈయన మరొక హీరోయిన్ తో ఏడడుగులు వేయబోతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరి వేణు స్వామి చెప్పిన జాతకం ఎవరి గురించి అనే విషయానికొస్తే తమిళనాడులో టీవీ కే పార్టీ స్థాపించిన నటుడు విజయ్ తలపతి రాజకీయాలలో ప్రస్తుతం చురుగ్గా ఉన్నారు. అయితే ఈయన తన భార్యకు విడాకులు ఇచ్చి స్టార్ హీరోయిన్ అయిన త్రిష తో పెళ్లి పీటలు ఎక్కబోతారు అంటూ వేణు స్వామి జోస్యం చెప్పారు. అయితే గత కొంతకాలంగా విజయ్ త్రిష డేటింగ్ గురించి వార్తలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో వేణు స్వామి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో మరోసారి ఈయన వార్తల నిలిచారు.