కృష్ణా జిల్లా గన్నవరం నియోజక వర్గంలో రోజు రోజుకి సీన్ వేడెక్కుతోంది. వైకాపా కు మద్ధతిస్తోన్న టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏక్షణమైనా రాజీనామా చేసి బయటకొచ్చే అవకాశం ఉంది. వచ్చేస్తే ఉప ఎన్నికకు నగరా మ్రోగనుంది. ఇదంతా పక్కాగా జగన్ ఆధ్వర్యలోనే జరుగుతుందని గన్నవరం టీడీపీ కోటను పునాదులతో సహా లేపేసేలా స్కేచ్ వేస్తున్నారన్నది ఇన్ సైడ్ టాక్. అయితే ఆ నియోజక వర్గంలో వైసీపీ నాయకుడు దుట్టా రామచంద్రరావు ఈ సారి టిక్కెట్ కోసం అంతే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. రేసులో వంశీ ఉండటంతో ఎట్టి పరిస్థితుల్లో తనకే టిక్కెట్ దక్కాలని పావులు కదుపుతున్నారు.
ఈ నేపథ్యంలో ఒకే వర్గంలో విబేధాలు తలెత్తాయి. ఓ వైపు అదిష్టానం ఇరువుర్నీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి గెలుపు నల్లేరు మీద నకడ చేయాలని భావిస్తుంటే …మరోవైపు అంతర్గత పోరు నియోజక వర్గంలో పార్టీకి సంకటంగా మారింది. వంశీని బరిలోకి దించి ఆ నియోజక వర్గంలో టీడీపీ నాయకులందర్నీ పార్టీలోకి లాగేయాలని అదిష్టానం సన్నాహాలు చేస్తుంది. అదే జరిగితే దుట్టా ప్రాబల్యం కోల్పోవడం ఖాయం. అందుకే ఆయన ఏమాత్రం తగ్గకుండా స్థానికంగా కీలక నేతల్ని గ్రిప్పులో పెట్టుకుంటున్నారు. ఇప్పటికే వంశీని విబేధిస్తున్నట్లు ఆయన విమర్శలతో చెప్పకనే చెప్పేసారు.
పార్టీ పట్ల తనకున్న విధేయథను చాటుకున్నారు. వంశీ కారణంగా వైసీపీ కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ బ్యాడ్ చేసే ప్రయత్నం చేసారు. ఈ నేపథ్యంలో దుట్టా వైసీపీ క్యాడర్ పై డైరెక్ట్ గా దాడికే దిగినట్లు ఓ హెచ్చరిక చెబుతోంది. పోరపాటున టిక్కెట్ గనుక వంశీకిస్తే తమ మద్ధతు ఎంత మాత్రం ఉండబోదని అనేసారు. ఇప్పుడి తిరుగుబాటే జగన్ కి ఇబ్బందికరంగా మారింది. దుట్టాని కాదనలేని పరిస్థితులు.. వంశీ ని పొమ్మనలేని పరిస్థితులు. అయితే ఈ రెండు పరిస్థితులును టీడీపీ అనుకూలంగా మార్చుకునే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతానికైతే ఆ పార్టీ అక్కడ యాక్టివ్ గా లేదు. వంశీ విబేధించిన తర్వాత గన్నవరం ఇన్ ఛార్జ్ పోస్ట్ ఖాళీగానే ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ బలమైన నాయకుడ్ని దింపి పాత సన్నివేశాన్నే రిపీట్ చేసి వంశీకి గట్టి షాక్ ఇవ్వాలని టీడీపీ భావిస్తోందిట.