వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మరోసారి తన తీరైన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో సంచలనం రేపారు. కూటమి పాలనపై విరుచుకుపడిన ఆయన, అధికారులను ఉద్దేశించి ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. “సమయం వస్తే ఒక్కరిని కూడా వదిలిపెట్టం… దేశం విడిచినవారిని కూడా రప్పిస్తాం” అని జాగ్రత్త పరుస్తూ, “సినిమా చూపిస్తాం” అనే మాటలతో గట్టిగా హితవు పలికారు.
వైసీపీ స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశంలో పాల్గొన్న జగన్, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై విపులంగా వివరించారు. టీడీపీ తీరు మరియు పోలీసులు అనుసరణ వైఖరి బాగోలేదని ఆవేశం వ్యక్తం చేశారు. “మేము భయపడే ప్రజానాయకులు కాదంటూ” ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు.
ఇక నందిగం సురేష్, వల్లభనేని వంశీ వంటి వైసీపీ నేతలు ఎలా కేసుల పాలయ్యారో వివరించిన జగన్, రాజకీయ కక్షలు తీర్చుకునేందుకు పోలీసుల సహకారంతో వైసీపీని లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. మహిళలు సహా కార్యకర్తలను అరెస్టు చేయడం దారుణమని విమర్శించారు. “ఒక్క కేసులో బెయిల్ వస్తే వెంటనే ఇంకో కేసుతో వెంటాడుతున్నారు” అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చివరగా, పార్టీ కార్యకర్తలకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందన్న ధైర్యం ఇచ్చిన జగన్, “రేపు నంబర్ వన్ కార్యకర్త మనవాడే అవుతాడు” అంటూ మద్దతుదారుల ఉత్సాహాన్ని పెంచే మాటలు చెప్పారు.