ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలట.. ఎందుకంటే.. ??

KCR

 

రాజకీయాల్లో ప్రతిపక్షం బలంగా లేకుండా చేసి పాలన చేస్తున్న రాష్ట్రం ఏదంటే తెలంగాణ అని అంటున్నారట.. ఎందుకంటే తెలంగాణాలో దొరల పార్టీకి ఎదురులేదనే విమర్శలు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి.. కేసీయార్ రాజకీయాల్లోకి ఎంటరై ప్రత్యేక తెలంగాణ సాధించడానికి ముందు నుండే టీఆర్ఎస్ పార్టీ సుదీర్ఘ కాలంగా పాలన చేయడానికి ప్రణాళిక రచించుకుని సిద్దంగా ఉంచుకున్నారట.. ఆ విధానాన్నే అమలుచేస్తూ తెలంగాణాలో తిరుగులేని నాయకునిగా కొనసాగుతున్నాడని అంటున్నారు.. ఇక సింహం లాంటి సీయం కేసీయార్ ముందు.. కుందేలు లాంటి కాంగ్రెస్ పిల్లలు ఎన్ని చప్పుళ్లు చేసిన ఇక్కడ భయపడడని ఎన్నో సందర్భాల్లో నిరూపించారు కూడా.. అయినా ఒంటి కాలుతో యుద్ధం చేస్తున్న కాంగ్రెస్ నేతలు సందు దొరికితే చాలు గులాభిని కాళ్ల కింద తొక్కాలని చూస్తున్నారు..

ఇక తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ ఆ విషయం కేసీయార్ మరిచారా? తెలియదు.. మరి కాంగ్రెస్ పార్టీలో పరిగెత్తే వాడిని పక్కటెముకళ్లో పొడిచి గెలవకుండా చేస్తారట?.. అసలు తెలంగాణాలో కాంగ్రెస్ గురించి చెప్పుకోవడానికి ఒక బలమైన కారణం ఉందా అంటే ఎవరి నుండి సౌండ్ రాదట.. మరి ఆ పార్టీని ప్రస్తుతం నమ్మే వారు ఎవరు? ఎందరు?.. ఇకపోతే గులాభి దొర మీద పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు.. నిజానికి తెలంగాణ ప్రజలు అన్యాయం అవుతున్నారని చేశారో, లేక తమ పార్టీని తెలంగాణాలో మట్టిలో కలిపేస్తున్నాడని చేశారో అర్ధం కాదు గానీ ఉత్తం కుమార్ కొన్ని ఉత్తమమైన పదాలు ప్రజల కోసం చెప్పారట.. అవేమంటే..

తెలంగాణ సర్కార్ కట్టే ప్రాజెక్టులన్నీ నీళ్ల కోసం కాదట.. కేసీఆర్ జేబులు నింపుకోవటానికేనట. వీరి నిర్వాకంతోనే కల్వకుర్తి ప్రాజెక్ట్ క్లోజ్ అయ్యిందట. ఇక కల్వకుర్తి ప్రాజెక్ట్ కి అండర్ గ్రౌండ్ టన్నెల్ పెడితే ప్రమాదమని 2016 జూన్ 22న ఎక్స్ పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది.. అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోకుండా పాలమూరు ప్రాజెక్ట్ కు అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ నిర్మాణం చేపట్టారు.. దీంతో కల్వకుర్తి పంప్ హౌజ్ ధ్వంసమైంది..

కాబట్టి దీనిపై జుడిషియరీ ఎంక్వైరీ వేసి విచారణ చేపట్టడమే కాదు ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు.. అయినా వీరి అరుపులకు ఈ సింహం భయపడుతుందా.. ముందు మీ పార్టీలో ఉన్న తగవులు తీర్చుకుని ఒకరికి ఒకరు రాజకీయంగా ఎదగడానికి సహకరించుకోండి.. ఆ తర్వాత అధికార పార్టీ మీద దండయాత్ర చేద్దురు గానీ అంటున్నారట ఈ విషయం తెలిసిన టీఆర్ఎస్ నాయకులు..