అతిపెద్ద ఊహించని మలుపు తిరిగిన జడ్జీల ఫోన్ ట్యాపింగ్ కేసు!

ఏబీఎన్ RK చేసిన ఆరోపణలు నిజం అవుతున్నాయా?

దేశంలో ఎక్కడా జరగని రాజకీయ వ్యూహాలన్ని ఏపీలోని జరుగుతాయి. నిన్న ఒక ప్రముఖ పత్రికలో వచ్చిన కథనం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఏపీలోని హై కోర్ట్ జడ్జ్ ల యొక్క ఫోన్స్ ట్యాప్ అవుతున్నాయని ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది. ఈ కథనం చదివిన పాఠకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ కథనం తరువాత కొంతమంది జడ్జ్ లకు సంబంధించిన స్వీయ అనుభవాలను రాసుకొచ్చారు.
Hight court stay on three capitals bill
కొన్ని ఫేక్ లింక్స్ పంపుతూ వాటిని క్లిక్ చేసిన తరువాత ఫోన్స్ ను ట్యాప్ చేస్తున్నారని వెల్లడించారు. అయితే ఈ కథనంలో ఎక్కడా కూడా ట్యాప్ ఎవరు చేస్తున్నారనే విషయాన్ని ప్రచురించలేదు కానీ ఈ కథనాన్ని వైసీపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ఆంధ్రజ్యోతి పత్రికకు క్షేమాపణలు చెప్పాలని నోటీసులు జారీ చేశారు.

ఇదిలా ఉండగా జడ్జిల ఫోన్ ట్యాపింగ్ పై, తాను రేపు హైకోర్టు లో పిల్ వేస్తున్నట్టు మాజీ జడ్జి న్యాయమూర్తి, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది శ్రవణ్‌కుమార్ వెల్లడించారు. ఇది అత్యంత దారుణమైన విషయమని, మన దేశంలో ఎప్పుడు ఇలాంటి పరిణామం జరగలేదని, దీని పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని, తాను రేపు హైకోర్టు ముందుకు వెళ్తున్నాని వెల్లడించారు. ఒకవేళ ఈ ఫోన్ వ్యవహారం నిజమైతే జగన్ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందని చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఈ కథనం అబద్ధమైతే ఆంధ్రజ్యోతి పత్రికపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది.

ఇప్పటికే ఈశ్వరయ్య ఆడియో టేప్స్ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న తరుణంలో ఈ కథనం మరింత సంచలనం రేపుతోంది. ఈ ట్యాప్ వ్యవహారం ఎక్కడిదాక వెళ్తుందో వేచి చూడాలి. వైసీపీ నాయకులు మాత్రం టీడీపీ నాయకులు కావాలనే తమకు అనుకూలంగా ఉన్న పత్రికల ద్వారా తప్పుడు కథనాలను ప్రచురిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఫోన్ ట్యాప్ వ్యవాహారం రోజుకో మలుపు తిరుగుతూ ప్రస్తుతం శ్రావణ్ దగ్గర వచ్చి ఆగింది. ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.