రాహుల్‌కి అలా, అమిత్ షా‌కి ఇలా.! గులాబీ తేడా ఎందుకిలా.?

TRS & BJP

TRS & BJP : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించాలనుకుంటే కుదరలేదు. రాహుల్ తెలంగాణ పర్యటన విషయమై తెలంగాణ సర్కారు అడుగడుగునా అడ్డంకులు సృష్టించిందనే విమర్శలొచ్చాయి. కానీ, కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది తెలంగాణ రాష్ట్ర సమితి.

కేంద్ర మంత్రికీ, ఓ జాతీయ పార్టీకి చెందిన కీలక నేతకీ మధ్య ప్రోటోకాల్ తేడా అది.. అన్నది చాలామంది వాదన. అయితే, కాంగ్రెస్ విషయంలో కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ పట్ల మాత్రం భయంతో, బాధ్యతతో వ్యవహరిస్తోందన్ని కాంగ్రెస్ నేతల వాదన.

కేంద్ర మంత్రి అమిత్ షా, తెలంగాణకి వచ్చి కేసీయార్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆ విమర్శలకు టీఆర్ఎస్ నుంచి ఘాటైన కౌంటర్ ఎటాక్ కూడా వచ్చింది. కానీ, ఈ డోస్ సరిపోదు.. అసలు ఇది డోస్ కానే కాదంటున్నారు కాంగ్రెస్ నేతలు.

బీజేపీ – టీఆర్ఎస్ మధ్య లోపాయకారీ ఒప్పందం వల్లే ఇలా జరుగుతోందనీ, కేసీయార్‌ని జైలుకు పంపిస్తామన్న బీజేపీ, ఆ మాట నిలబెట్టుకోవాలనీ కాంగ్రెస్ నేతలు, బీజేపీకి సవాల్ విసురుతున్నారు. మరోపక్క, టీఆర్ఎస్ మాత్రం, తెలంగాణపైకి రెండు జాతీయ రాజకీయ పార్టీలు దండయాత్రకు వస్తున్నాయని ఆరోపిస్తోంది.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పొత్తు కుదరబోతోందని కాంగ్రెష్ ఖచ్చితంగా చెబుతోంటే, కాంగ్రెస్ – టీఆర్ఎస్‌ల ఉమ్మడి రాజకీయ వ్యూహకర్త మాత్రం, ఈ రెండు పార్టీలూ కలవాలనుకుంటున్న సంగతి తెలిసిందే.