క్లైమాక్స్ కి చేరిన రమణ దీక్షితులు VS టీటీడీ వివాదం?

గత కొన్ని నెలలుగా టీటీడీ చేసే పనులు, వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు చర్చనీయాంశం అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం టీటీడీ చైర్మన్ గా ఉన్న నటుడు పృథ్వి మీద వచ్చిన ఆరోపణలు అందరికి తెలిసినవే. ఆ ఆరోపణల వల్ల ఆయన చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేశారు. అయితే తాజాగా టీటీడీ ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణా దీక్షితులు మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన టీడీపీ హయాంలో ప్రధాన అర్చకులుగా తొలగించబడ్డారు. ఆ తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన మళ్ళీ అర్చకులుగా నియమింపబడ్డారు.

అయితే రమణ దీక్షితులు టీటీడీపై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృస్తిస్తున్నారు. శ్రీవారి ఆలయ అర్చకులకు రక్షణ కల్పించడంలో టీటీడీ విఫలమైందని ఆయన ఆరోపించారు. గతంలో తనకు వారసత్వంగా వచ్చిన శ్రీవారి అర్చకత్వం కొనసాగేలా చూడాలని పోరాడి ఓడిపోయి బలవంతంగా పదవీ విరమణ చేసిన టీటీడీ సీనియర్ అర్చకుడితో పాటు ఇటీవల కరోనా వల్ల చనిపోయిన 45 ఏళ్ల అర్చకుడి కుటుంబాలను ఆదుకొవాలని ఆయన కోరారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలను ట్యాగ్ చేస్తూ అర్చకుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కొన్ని నెలలుగా ఆయన టీటీడీ మీద జగన్ సర్కారు మీద విమర్శలు గుప్పిస్తున్నారు. భూముల విక్రయానికి జీవో ఇవ్వడం సహా వివిధ అంశాల్లో టీటీడీ తీరును దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే మరోసారి టీటీడీ మీద ఆయన విమర్శలు గుప్పించారు. రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యల వల్ల ఏపీలో రమణ వర్సెస్ టీటీడీ గా మారింది. ఈ వ్యాఖ్యలపై టీటీడీ, వైసీపీ అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మళ్ళీ తన స్థానంలోకి వచ్చిన రమణ, వైసీపీకి అనుకూలంగా ఉంటారని అందరు అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీ నాయకులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.