నేడు శని త్రయోదశి.. ఈ చిన్న పని చేస్తే చాలు ఏలినాటిశని తొలగిపోతుంది?

సాధారణంగా శని ప్రభావంతో బాధపడేవారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.ఈ క్రమంలోనే శని ప్రభావం దోషం తొలగిపోవడం కోసం ఎన్నో పరిహారాలు చేస్తూ శని దోషం నుంచి విముక్తి పొందుతారు. అయితే శని ప్రభావం నుంచి బయటపడాలంటే శని త్రయోదశి రోజు ప్రత్యేక పూజలు చేయడం వల్ల శని ప్రభావ దోషం నుంచి బయటపడవచ్చు. నేడు శనిత్రయోదశి కావడంతో ఈ చిన్న పరిహారం చేస్తే శని నుంచి విముక్తి పొందవచ్చు.

నేడు శనిత్రయోదశి కేవలం శనీశ్వరునికి మాత్రమే కాకుండా శివకేశవులకు కూడా ఎంతో ప్రీతికరమైన రోజు అందుకే ఈ శని త్రయోదశి రోజు విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామికి కూడా ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఇక శని జన్మించిన తిథి కూడా త్రయోదశి కావడంతో శనివారం వచ్చే త్రయోదశిని శని త్రయోదశి అంటారు. ఈ శని త్రయోదశి రోజు ఉదయమే నిద్రలేచి శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. అనంతరం నువ్వులతో స్వామివారికి అభిషేకం చేసిన తరువాత నీలిరంగు పుష్పాలతో స్వామివారిని భక్తితో పూజించాలి.అదే విధంగా స్వామివారికి బెల్లం నైవేద్యంగా సమర్పించి నల్లని వస్త్రంలో నల్లటి నువ్వులు నువ్వుల నూనె ఇతరులకు దానం చేయాలి.

అదేవిధంగా శని త్రయోదశి రోజు కాకులకు దానం చేయడం ఎంతో మంచిది. ఈ విధంగా కాకులకు దానం చేయటం వల్ల పితృ దోషాలు తొలగిపోతాయి. ఇక శని త్రయోదశి కేవలం శనీశ్వరునికి మాత్రమే కాకుండా శివకేశవులకు కూడా ఎంతో ప్రీతికరమైనది కనుక శివకేశవులు కొలువై ఉన్న అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణలు చేసి అనంతరం నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల శివకేశవుల అనుగ్రహం కూడా మనపై ఉంటుంది.