Omicron Food: ఒమిక్రాన్ బారిన పడకుండా ఉండాలంటే ఈ డైట్ ఫాలో అవ్వాల్సిందే..!

Omicron foods: గడచిన రెండు సంవత్సరాలుగా ప్రపంచం మొత్తాన్ని కుదిపేస్తున్న సమస్య ఏదైనా ఉందంటే అది కరోనా అని టక్కున చెప్పవచ్చు. ఇప్పటికే రెండు దశలలో వచ్చి చాలామందికి బంధాలు, బంధుత్వాలను దూరం చేసింది. ఇప్పుడు మళ్ళీ ఒమిక్రాన్ రూపంలో రోజురోజుకు విపరీతంగా కేసులు పెరుగుతూ థర్డ్ వేవ్ ముప్పును సూచిస్తోంది, ఎన్ని వ్యాక్సిన్ లు వేసుకున్నా, ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఏదో విధంగా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఏది ఏమైనా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెంచే ఫుడ్స్ తీసుకొని జాగ్రత్త పడటం ఆరోగ్యానికి శ్రేయస్కరం .

కివి ఫ్రూట్స్: కివి పళ్ళు రోగనిరోధకశక్తిని పెంచడానికి ఎంతగానో దోహదపడతాయి. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లు, పొటాషియం ఎక్కువగా లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

పసుపు: పసుపులో చాలా యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయి. తరచూ వంటలలో పసుపుని వినియోగించడం వల్ల ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

అల్లం మరియు వెల్లుల్లి: రోజు వారి వంటల మాసాలలో అల్లం , వెల్లుల్లిని తరచుగా వాడుతుంటాం. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఇవి ఇమ్మునిటీ పవర్ నీ పెంచడమే కాక ఇన్ఫెక్షన్లు, గొంతు నొప్పి, వికారం మొదలైన సమస్యల నుండి కూడా కాపాడతాయి.

పాలకూర: పాలకూర రోగ నిరోధక శక్తిని పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి ఐరన్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. ఈ సూపర్ ఫుడ్స్ తినడం వల్ల ఇన్ఫెక్షన్ నుండి కొంతమేర బయటపడవచ్చు.