వైరల్ : పవన్ తర్వాత తన ట్యాగ్ వదులుకున్న మరో బిగ్ స్టార్.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో ఎంత సింపుల్ గా ఉంటాడో అందరికీ తెలిసిందే. సినిమాలకి తన రియల్ లైఫ్ కి కూడా పవన్ చాలా వ్యత్యాసం చూపిస్తాడు. అయితే తన కెరీర్ పరంగా పవన్ పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే రీసెంట్ గా అలంటి నిర్ణయాన్నే పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు.

సినిమాలు పరంగా తన పేరు ముందు పవర్ స్టార్ అనే ట్యాగ్ తనకొద్దు తీసేయాలని తన సినిమా యూనిట్స్ అందరికీ చెప్పగా అక్కడ నుంచి తన సినిమా అప్డేట్స్ లో ఎక్కడా కూడా పవర్ స్టార్ అనే ట్యాగ్ కనిపించలేదు మీరు గమనించారో లేదో. ఇప్పుడు ఇలాంటి పెద్ద నిర్ణయాన్నే కోలీవుడ్ కి చెందిన బిగ్ స్టార్ థలా అజిత్ కుమార్ తీసుకున్నారు.

తన పి ఆర్ ఓ చేత అజిత్ ఇక నుంచి ఎవరు కూడా తనని థలా అజిత్ అని పిలవొద్దు అని ఆ ట్యాగ్ ని తీసేస్తున్నానని తెలిపారు. పిలిస్తే అజిత్, అజిత్ కుమార్ లేదా ఏ కే అని మాత్రమే పిలవాలని అందరి అభిమానులకు సినీ వర్గాలకు విన్నపం చేసుకున్నారు. దీనితో ఈ ప్రకటనతో పవన్ తీసుకున్న నిర్ణయంకి సింక్ అయ్యిందని ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.