పార్టీ కోసం పదేళ్లపాటు కష్టపడినవారిని, క్షేత్ర స్థాయిలో పార్టీకి బలమైన పునాదులు వేసిన వారిని, సీనియర్లని, జూనియర్లని జగన్ మోహన్ రెడ్డి పక్కనబెట్టిన మాట వాస్తవం. ముందు కనిపించే కొమ్ములుకన్నా..వెనకనున్న తోకలే ముఖ్యమని జగనన్న అలాంటి వాళ్లకే పార్టీలో పెద్ద పీట వేసారు. ఇటీవల ఎమ్మెల్సీ సహా, కొత్తగా మంత్రులు అయిన వారి పేర్లను పరిశీలిస్తే ఆవిషయం స్పష్టంగా అర్ధమవుతుంది. మీడియా సైతం ఊహించని ట్విస్ట్ అనే అనాలి దీన్ని. మీడియా, నిపుణుల అంచనాల్ని సైతం తల్లకిందులు చేసి జగన్ కొత్త నేతల్ని సీన్ లొకి తీసుకొచ్చి షాకిచ్చారు. ఎన్నికలకు ముందు సీటు త్యాగం చేసిన సీనియర్ నేత మర్రి రాజశేఖర్ నుంచి జగన్ స్వయంగా పదవులు ఇస్తానని ఆశపడిన నేతల వరకూ చాలా మందే ఉన్నారుగా.
సరిగ్గా ఎన్నికలకు ముందు వచ్చిన పండుల రవీందర్ ఎమ్మెల్సీ అయిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయిన తోట త్రిమూర్తులు జిల్లా ఇన్ ఛార్జ్ అయిపోయారు. ఇలాంటి పదవులపై ఆశల పెట్టుకున్న వాళ్లంతా చివరికి ఆటలో అరటి పండులా మిగిలిపోయారు. 13 జిల్లాల వ్యాప్తంగా ఇలాంటి జాబితా తీస్తే పెద్దతే ఉంటుంది. ఈ నేపథ్యంలో భంగపడ్డ ఆశావాహుల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నప్పటికీ దాన్ని ఎక్కడా బయటపెట్టకుండా జాగ్రత్త పడుతున్నారు. జగనన్న ఉన్నాడు ఏనాడైనా కరుణించకపోతాడా? అని ధీమాగా ఎదురుచూస్తున్నారు. అశావహులంతా ఏరోజైనా నాకు తాడేపల్లి నుంచి ఫోన్ కాల్ రాకుండా పోతుందా? పదవీ బాధ్యతలు చేపట్టకుండా ఉంటానా? అన్న ఎంతో బలమైన నమ్మకంతో ఎదురుచూస్తున్నారు.
పార్టీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసిన జగన్ సామాజిక వర్గం కూడా నామినేటెడ్ పోస్టులు రాకపోతాయా? అని ఎంతో ఆశగా ఎదురుచస్తున్నారు. ఇప్పటికే జగన్ ఏడాదిన్నర పాలన పూర్తయింది. మరో ఏడాది పాటు ఇప్పుడున్న మంత్రి వర్గమంతా ఉంటుంది. ఆ తర్వాత ప్రక్షాళన తప్పదు. ఈ మాట జగన్ ముందే చెప్పారు. పదవులు కాదు..సేవ ముఖ్యం. కాబట్టి రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గం మారుతుందని జగన్ చెప్పిన మాటను కూడా గుర్తుచేసుకోవాలి.