Chandra Babu: తాను సీఎం అవ్వగానే జగన్ జైలుకు వెళ్లేవాడు…. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

Chandra Babu: 2024 పూర్తి చేసుకొని 2025వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా చిట్ చాట్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మీడియా వారు అడిగే ప్రశ్నలకు కాస్త అసహనం వ్యక్తం చేశారు అదే విధంగా తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న అభివృద్ధి గురించి కూడా చంద్రబాబు నాయుడు వివరించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎంతో దెబ్బతీశారో ఆయన చేసిన తప్పులను మేము సరిదిద్దుతున్నామని తెలిపారు. ఇక ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే కొన్ని హామీలను నెరవేర్చాము త్వరలోనే మరికొన్ని పథకాలను కూడా అమలు చేయబోతున్నామని చంద్రబాబు తెలిపారు.

ఇక ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఎంతో అధ్వానంగా మారిపోయిన రోడ్లకు పూర్వ వైభవం తీసుకువస్తున్న విషయం తెలిసిందే. పైకి తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతున్నాము అంటూ కొంతమంది వైకాపా నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని తెలిపారు. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్థిక లోటును పూడుస్తూనే మరోవైపు ప్రభుత్వ పథకాలను అందజేస్తూ.. అభివృద్ధి వైపు కూడా అడుగులు వేస్తున్నామని తెలిపారు.

ఇక కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారు. అంటూ కొంతమంది నాయకులు కామెంట్లు చేస్తున్నారు. ఒకవేళ నేను కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ఉంటే కనుక నేను సీఎం అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించేవాడిని. తమకు అలాంటి ఉద్దేశం లేదన్నారు. మాజీ సీఎం జగన్ కు ఉన్న ఆలోచనలు తమకు లేవని, అటువంటి దృక్పథం జగన్ కే సొంతమన్నారు.