Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కడప రిమ్స్ ఆసుపత్రికి వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. కడప ఎంపీడీవో జవహర్ బాబు పట్ల వైకాపా నాయకులు దాడి చేయడంతో ఆయన తీవ్ర గాయాలు పాలయ్యారు. ఈ క్రమంలోనే కడపలో చికిత్స పొందుతున్నటువంటి జవహర్ బాబును పరామర్శించడం కోసం పవన్ కళ్యాణ్ కడప వెళ్లారు. ఇలా ఆయన డిప్యూటీ సీఎం తరహాలో అధికారులకు భరోసా ఇవ్వడం కోసం వారికి ధైర్యం చెప్పడం కోసం అతనిని పరామర్శించడం నూటికి నూరు శాతం కరెక్టే.
ఇక జవహర్ బాబును పరామర్శించిన తర్వాత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో భాగంగా ఈయన మాట్లాడుతూ వైసీపీ నాయకుల పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ నాయకులకు అహంకారం నడినెత్తిన ఉంది 11 సీట్లు వచ్చిన వీరి అహంకారం తగ్గలేదు వీరి అహంకారం తగ్గిస్తాను. ఇకపై ఇలాంటి దాడులకు పాల్పడకుండా తోలువలచి చేతిలో పెడతాం అంటూ సినిమా డైలాగులు చెప్పారు.
అవసరమైతే రాయలసీమలో కూడా తాను క్యాంపు కార్యాలయం పెడతానని పవన్ ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడటంతో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఒక రాజకీయ నాయకుడిలా కాకుండా పవన్ కళ్యాణ్ తాటతీస్తా తోలు ఒలుస్తా అంటూ సినిమా డైలాగులు చెబుతున్నారని పలువురి విమర్శిస్తున్నారు. ఒక ఉన్నత హోదాలో ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రవ్యాప్తంగా అందరిని సమన్యాయంతోనే చూడాలి.
కడపలో వైకాపా నాయకులకు తాటతీస్తావు తోలువలుస్తావు మరి కాకినాడలో జనసేన కార్యకర్తలకు ఇలాగే తాట తీయగలవా? తోలు తీయగలవా అంటూ సోషల్ మీడియా వేదికగా కాకినాడ ఘటనకు సంబంధించిన పోస్టులు చేస్తున్నారు. కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్‌లో జరిగిన ఈ ఘటనను పోస్ట్ చేస్తున్నారు. కాలేజీ గ్రౌండ్లో బయట వ్యక్తులు వచ్చి వాలీబాల్ ఆడటంతో కాలేజీ విద్యార్థులు ఆడటానికి వీలు లేకుండా పోతుంది అంటూ మెడికల్ విద్యార్థులు ప్రిన్సిపల్ కి ఫిర్యాదు చేశారు.
ప్రిన్సిపల్ కి ఫిర్యాదు వెళ్లడంతో కళాశాల గ్రౌండ్‌లో బయటి వ్యక్తులు ఆటలు ఆడవద్దని ఆంక్షలు విధించారు. ఎమ్మెల్యే పంతం నానాజీ డాక్టర్ ఉమామహేశ్వరరావును తీవ్ర అసభ్య పదజాలంతో దూషించారు. ఆయన అనుచరులు దాడి చేశారు. మరి పవన్ కళ్యాణ్ అక్కడకు వెళ్లి డాక్టర్ ను పరామర్శించి ఎందుకు తాట తీస్తానని అనలేదంటూ పవన్ కల్యాణ్ ను వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దాడికి గురైన ఇద్దరూ దళితులే. కానీ వేర్వేరు చోట్ల వేరేయేషన్ ఏంటని ప్రశ్నిస్తున్నారు తరువాత కడపలో వైకాపా నాయకులకు తాటతీద్దువు గాని ముందు కాకినాడలో జనసేన కార్యకర్తల గురించి మాట్లాడు అంటూ ప్రశ్నిస్తున్నారు.