Tonsils: టాన్సిల్స్ సమస్య నుంచి విముక్తి పొందాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే!

Tonsils: ప్రస్తుత కాలంలో వాతావరణంలో ఎన్నో మార్పులు వచ్చాయి. వాతావరణ కాలుష్యం వలన అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.. ముఖ్యంగా శీతాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. శీతాకాలంలో దగ్గు , జలుబు , జ్వరం , గొంతు నొప్పి వంటి సమస్యలు అధికంగా ఉంటాయి. ఈ సమస్యలే కాకుండా శీతాకాలంలో టాన్సిల్స్ సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. గొంతులో ఇన్ఫెక్షన్ కావడం వల్ల గొంతు నొప్పి , గొంతువాపు , జ్వరం , తలనొప్పి వంటివి టాన్సిల్స్ లక్షణాలు.

శీతాకాలంలో చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు వేధించే ఈ టాన్సిల్స్ సమస్య చల్లటి పానీయాలు , చల్లటి తేమ గాలి వలన వ్యాపిస్తుంది. ఈ టాన్సిల్స్ సమస్యను తేలికగా తీసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంటి చిట్కాలను ఉపయోగించి ఈ టాన్సిల్స్ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.

పాలు ఆరోగ్యానికి కావలసిన అన్ని రకాల పోషక విలువలను కలిగి ఉంటాయి. ప్రతి రోజు ఒక గ్లాస్ పాలు తాగటం వల్ల మన శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది.. పాలను ఉపయోగించి టాన్సిల్స్ సమస్య కు చెక్ పెట్టవచ్చు. పాలను బాగా మరిగించి అందులో చిటికెడు పసుపు వేసి ప్రతి రోజూ రాత్రి నిద్రపోయే ముందు తాగటం వలన టాన్సిల్స్ సమస్య నుండి విముక్తి పొందవచ్చు.

ప్రతిరోజు వంటిట్లో ఉపయోగించే పదార్థాలలో ఉప్పు తప్పనిసరిగా ఉంటుంది. టాన్సిల్స్ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు గోరువెచ్చని నీటితో ఉప్పు కలిపి పుక్కిలించడం వలన గొంతులో ఉన్న బ్యాక్టీరియా నశించి గొంతు నొప్పి నుండి త్వరిత ఉపశమనం కలిగిస్తుంది. ఇలా రోజుకు మూడు , నాలుగు సార్లు చేయడంవల్ల టాన్సిల్స్ సమస్య నుండి విముక్తి పొందవచ్చు. సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ నీ సంప్రదించడం శ్రేయస్కరం.

తులసి ఆరోగ్యానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్స్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండటం వలన గొంతులో ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. కొన్ని తులసి ఆకులను పదినిమిషాల పాటు నీటిలో బాగా మరిగించి ఆ నీటిని వడ పోసి కొంచెం ఉప్పు , నిమ్మరసం , కలిపి తీసుకోవడం వలన టాన్సిల్స్ సమస్య తగ్గు ముఖం పడుతుంది.