చలికాలంలో చర్మకాంతి పెరగాలంటే ఈ జ్యూస్ లు తప్పనిసరి!

ప్రస్తుత కాలంలో అందరూ ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో అలాగే చర్మ సౌందర్యం మీద కూడా అంతకన్నా ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. తరచూ ఫేస్ ప్యాక్ లని, ఫేషియల్ అని బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి డబ్బులు ఖర్చు చేస్తున్నారు.ఈ ఫేషియల్, ఫేస్ ప్యాక్ కంటే ఇంట్లోనే మనం తయారుచేసుకుని కొన్ని జ్యూస్ లు తాగడం వల్ల అందానికి మరియు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు మనం ఆ జ్యూస్ లు ఏవో తెలుసుకుందాం.

కాలానుసారంగా వాతావరణం మారటం వల్ల చర్మానికి తగినంత పోషణ చాలా అవసరం. వేసవికాలంలో వేడి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల చర్మం నల్లబడటం, చెమటతో ఇన్ఫెక్షన్స్ రావటం వంటివి ముఖ్య సమస్యలు. అలాగే శీతాకాలంలో కూడా చలి ఎక్కువగా ఉండటం వల్ల చర్మం తరచూ పొడిబారటం, పగలటం వంటివి ముఖ్య సమస్యలు. ముఖ్యంగా మనం ఇప్పుడు శీతాకాలంలో చర్మ సౌందర్యానికి అవసరమైన జ్యూస్ ల గురించి తెలుసుకుందాం.

పండ్లు, కూరగాల జ్యూసులు మన శరీరానికి అవసరం అయ్యే యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్, మినిరల్స్ ను పుష్కలంగా అందిస్తాయి. అంతే కాదు ఇవన్నీ కూడా మన చర్మ ఆరోగ్యానికి, అందానికి చాలా ఉపయోగపడతాయి. జ్యూస్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్ చర్మం మీద ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా వేగంగా నయం చేస్తాయి. అంతే కాదు వాటి స్థానంలో కొత్త స్కిన్ సెల్స్ ఏర్పడుతాయి.

పండ్లు ,కూరగాయలు జ్యూస్ చేసుకొని తాగడం వల్ల చర్మకాంతి పెరుగుతుంది అనటంలో సందేహం లేదు. బొప్పాయి తినటానికి రుచిగా ఉండటమే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా చాలా. బొప్పాయిలో ఉండే విటమిన్ చర్మంలోని మలినాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బొప్పాయిని ఫేషియల్ స్ర్కబ్ గా ఉపయోగిస్తుంటారు. బాగా పండిన బొప్పాయిని ముఖానికి రాసుకోవడం వల్ల చర్మకాంతి పెరిగి మొటిమల సమస్య తగ్గుతుంది.

క్యారెట్ ఎన్నో పోషకాలు, విటమిన్స్ కలిగి ఉంటుంది.శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది. ఇది చర్మంను శుభ్రం చేస్తుంది.దాంతో చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. ప్రతిరోజు క్యారెట్ జ్యూస్ చేసుకొని తాగడం లేదా పచ్చిది తినటం వల్ల చర్మ సౌందర్యానికి చాలా మంచిది.

నిమ్మకాయ జ్యూస్ ప్రతిరోజు తాగటం వల్ల లేదా కొద్దిగా నిమ్మ రసం మరియు శెనగపిండి పేస్టులా చేసి మొహానికి రాసుకొని పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మొటిమలు మచ్చలు సమస్య తగ్గుతుంది.

బీట్ రూట్ మరియు టమోటో జ్యూస్ లు ప్రతిరోజు తాగడం వల్ల చర్మసౌందర్యం పెరుగుతుంది. బీట్ రూట్ లో విటమిన్స్ ,ఐరన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. బీట్ రూట్ జ్యూస్ రోజు తాగడం వల్ల శరీరంలో రక్త శాతం పెరగడమే కాకుండా శరీర బరువు తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది.