Corona Virus: గత రెండు సంవత్సరాల క్రితం చైనాలో ఉద్భవించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటినీ గడగడ వణికించింది. ఒకరి నుండి ఒకరికి అత్యంత వేగంగా వ్యాప్తి చెంది ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది. ఈ కరోనా కారణంగా ఎంతోమంది వారి ఆప్తులను కోల్పోయారు. మరికొంతమంది కరోనా కారణంగా వ్యాపారాలు జరగటం ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తర్వాత నుండి కోలుకున్న తర్వాత కూడా వారిలో కొన్ని ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కరోనా నుంచి కోలుకున్న పురుషులలో సంతానోత్పత్తి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని తాజాగా ఐఐటీ బొంబాయి జరిపిన పరిశోధనలో వెల్లడయ్యింది. ఐఐటీ బొంబాయి, జస్లోక్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ సైంటిష్టులు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో. కోవిడ్ బారిన పడి కోలుకున్న పురుషులలో సంతానోత్పత్తి సమస్యలు తలెత్తుతాయని పరిశోధనల్లో వెలుగుచూసింది. కరోనా సోకి లక్షణాల తీవ్రత తక్కువగా ఉన్న వారిలో సైతం ర సంతానోత్పత్తికి సంబంధించిన ప్రోటీన్లు దెబ్బతింటాయని ఈ అధ్యయనం వెల్లడించింది. పురుషుల వీర్యకణాలపై చేసిన ఈ పరిశోధనను.. ఏసీఎస్ ఒమెగా జర్నల్ గతవారం పబ్లిష్ చేసింది.
ఈ పరిశోధనలో కరోనాకు కారణమైన సార్స్-2 వైరస్ ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థను నాశనం చేసి దాంతో పాటు ఇతర వ్యవస్థలను కూడా నాశనం చేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. పదిమంది ఆరోగ్యవంతమైన పురుషులు, 17 మంది కరోనా సోకిన పురుషుల మీద ఈ అధ్యయనం చేయగా.. ఆరోగ్యంగా ఉన్న పురుషులతో పోలిస్తే కరోనా సోకిన పురుషులలో సంతానోత్పత్తికి సంబంధించిన సెమెనోజెలిన్1, ప్రోసాపోసిన్ అను రెండు ప్రోటీన్లు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడయింది. ఈ విషయం గురించి ఇంకా లోతుగా అధ్యయనాలు చేయవలసి ఉందని పరిశోధకులు వెల్లడించారు.