Health Tips: దేశంలో కరోనా వ్యాప్తి చెందిన అప్పటినుంచి ప్రజలందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది.ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు.చాలా మంది ఉదయం లేవగానే వ్యాయామాలు చేయటం అలవాటు చేసుకున్నారు. ఉదయం పూట వాకింగ్, జాగింగ్ వ్యాయామాలు చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఉదయం పూట అరగంట సమయం పాటు వాకింగ్ లేదా జాగింగ్ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.ఉదయం అరగంట సమయం జాగింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లలో మార్పులు రావడం వల్ల చిన్న వయసు వారికి కూడా కాళ్ల నొప్పులు కండరాల నొప్పులు వంటి సమస్యలు వేధిస్తుంటాయి.ప్రతి రోజు ఉదయం లేవగానే జాగింగ్ చేయడం వల్ల కండరాలు ఎముకలు దృఢంగా మారి ఎటువంటి నొప్పులు ఉండవు. అంతే కాకుండా అధిక బరువు తగ్గాలనుకుంటే ఈ క్రమం తప్పకుండా పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటూ మూడు నెలల పాటు జాగింగ్ చేయడం వల్ల 5 నుండి 10 కిలోల వరకు సులభంగా బరువు తగ్గొచ్చు.
ప్రస్తుత కాలంలో అందరిని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్యలు డయాబెటిస్ సమస్య ప్రధానమైనదిగా భావించవచ్చు.ఈ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజూ ఉదయం అరగంట సమయం వాకింగ్ చేయడం వల్ల వారి సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు. యువతీ యువకులు కూడా ప్రతిరోజు ఇలా అరగంట సమయం పాటు జాగింగ్ చేయడం వల్ల డయాబెటిస్ దరిచేరకుండా ఉంటుంది.
ప్రతిరోజు ఉదయం జాగింగ్ చేయడం వల్ల కండరాలు ఎముకలు దృఢంగా తయారవడానికి కాకుండా మెదడు కూడా చాలా చురుకుగా పని చేస్తోంది. నిద్రలేమి సమస్యతో బాధపడే వారు కూడా ఇలా చేయటం వల్ల రాత్రిపూట హాయిగా నిద్ర పడుతుంది. ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా హాయిగా నిద్ర పోవడం వల్ల ఉదయం కూడా తెల్లవారుజామున లేవటానికి వీలవుతుంది.